PS Mithran: ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే స్టార్ హీరోయిన్ నయనతార – డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరో తమిళ దర్శకుడు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయిపోయాడు. కోలీవుడ్ లో అగ్రదర్శకుడిగా పేరొందిన పిఎస్ మిత్రన్.. లేడీ ఫిలిం జర్నలిస్టు ఆషామీరా అయ్యప్పన్ ను పెళ్లాడనున్నాడు.
కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక జూన్ 24న వీరి ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రస్తుతం మిత్రన్, ఆషామీరాల ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ మిత్రన్ – ఆషామీరాల జంటకు కోలీవుడ్ స్టార్ హీరోలు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హీరో కార్తీ, డైరెక్టర్ రవి కుమార్ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆషామీరా.. డైరెక్టర్ మిత్రన్ తో ఎంగేజ్మెంట్ అయినట్లు తెలుపుతూ.. తమపై ఇంత ప్రేమ కురిపిస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్స్ అని తెలిపింది. కాగా మిత్రన్.. విశాల్ హీరోగా అభిమన్యుడు, శివకార్తికేయన్ తో హీరో సినిమాలు చేశాడు. ఇప్పుడు కార్తీతో సర్దార్ మూవీతెరకెక్కిస్తున్నాడు. మరి మిత్రన్ – ఆషామీరాల ఎంగేజ్మెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
.@Psmithran and I are humbled and a tad overwhelmed by all the love pouring in. Thank you so much for making our day much more special. ☺️😁♥️
— Ashameera Aiyappan (@aashameera) June 24, 2022
Director PS Mithran engaged to Journalist Ashameera ❤️ pic.twitter.com/3zniGZBfn2
— Behindwoods (@behindwoods) June 24, 2022
Congrats lovely couple @Psmithran & @aashameera . So happy for you both.💐👍😊. Keep smiling. pic.twitter.com/xeFTCYqufR
— Rathna kumar (@MrRathna) June 24, 2022
Dear @psmithran and @aashameera many congratulations on your engagement! Let the love❤️ grow stronger😊.
— Actor Karthi (@Karthi_Offl) June 25, 2022