ప్రస్తుతం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం.. సర్కారు వారి పాట. సూపర్ స్టార్ మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. మే 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచింది. సర్కారు వారి పాట ట్రైలర్‌ను గమనిస్తే ఇదొక పక్కా కమర్షియల్ మూవీ అని అర్థమవుతుంది. సినిమాలో డైలాగులు బుల్లెట్లలా పేలబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. మరీ ముఖ్యంగా ట్రైలర్‌లో ‘నేను విన్నాను నేను ఉన్నాను..’ డైలాగ్ తెగ వైరల్ అయ్యింది.
ఇది కూడా చదవండి: “నేను విన్నాను, నేను ఉన్నాను”! మహేష్ బాబు నోట జగన్ మాట!
ఈ మాటను దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అంటుండేవారు. ఇప్పుడు ఆయన కుమారుడు వై.ఎస్.జగన్, ఏపీ సీఎంగా ఉండటంతో సదరు పార్టీ వర్గాలు కూడా డైలాగ్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్‌తో పాటు అందరినీ ఆకట్టుకున్న ఆ డైలాగ్‌ను పరశురామ్ ఎందుకు రాయాల్సి వచ్చింది అనే సందేహం జనాల్ని తొలిచేస్తుంది. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా.. రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ‘నేను విన్నాను నేను ఉన్నాను..’ అనే డైలాగును ‘సర్కారు వారి పాట’ చిత్రంలో ఎందుకు రాయాల్సి వచ్చిందో రీసెంట్ ఇంటర్వ్యూలో వివరించారు డైరెక్టర్ పరశురామ్.
ఇది కూడా చదవండి: మహేష్ బాబు డ్యాన్సింగ్ స్కిల్స్ పై శేఖర్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్..!
ఈ సందర్భంగా పరశురామ్ మాట్లాడుతూ.. ‘‘నాకు వై.ఎస్.రాజ శేఖర్ రెడ్డిగారంటే హీరో వర్షిప్ ఉండేది. ఆయన చెప్పిన ‘నేను విన్నాను నేను ఉన్నాను..’ అనే మాట నాకెంతగానో నచ్చింది. చాలా పెద్ద మీనింగ్ ఉన్న దాన్ని చిన్నమాటగా భలే చెప్పారే అనిపించింది. అలాంటి సిట్యువేషన్ ‘సర్కారు వారి పాట’లోవచ్చినప్పుడు.. హీరో మహేష్‌గారు కీర్తి సురేష్‌కి మాట ఇవ్వాల్సి వచ్చినప్పుడు ‘నేను విన్నాను నేను ఉన్నాను..’ డైలాగ్ స్క్రిప్టులో రాసుకున్నాను. షూటింగ్ సమయంలోనూ మహేష్‌గారు అభ్యంతరం చెప్పలేదు’’ అన్నారు. పరశురామ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: మహేశ్ బాబు- నమ్రత ఇంటికొస్తానంటే రావొద్దని చెప్పాను: చిరంజీవి
— Deadpool Reddy (@Deadpool_Reddy) May 6, 2022