టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె నీలిమ గుణ వివాహం శుక్రవారం జరగనుంది. ఆమె పెళ్లికూతురిలా ముస్తాబైంది. మరికొద్ది గంటల్లో వివాహ బంధంలోకి అడుగు పెట్టనుంది నీలిమ. రవిప్రఖ్యా అనే ప్రముఖ వ్యాపారవేత్తను నీలిమా వివాహం చేసుకోనుంది. వీరి వివాహం శుక్రవారం ఫలక్ నుమా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రస్తుతం నీలిమ గుణ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవలే కొన్ని రోజుల క్రితం రవి ప్రఖ్యా, నీలిమల నిశ్చితార్ధం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్లో ఘనంగా జరిగింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై ఈ జంటను ఆశీర్వదించారు. ఇక నీలిమ విషయానికి వస్తే.. తండ్రి ద్వారా సినీరంగాపై ఆసక్తి పెంచుకుని నిర్మాతగా మారారు. గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి సినిమాకు నీలిమ సహ నిర్మాతగా వ్యవహరించారు. అదే విధంగా ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం సినిమాకు నీలిమ నిర్మిస్తున్నారు. మెయిన్ లీడ్ కారెక్టర్లను ఎంచుకోవడంలో నీలిమ పాత్రే ఉందట. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండాగా, త్రీడీలో ప్రదర్శించేందుకు మేకర్స్ భావిస్తున్నారు. ఆకారణంతో సినిమా విడుల ఆలస్యమైనట్లు సమాచారం. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమయ్యారు.
ఇక గుణశేఖర్ విషయానికి వస్తే.. తనదైన మూవీస్ తో తెలుగు ప్రేక్షకల మదిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఒక్కడు’ సినిమా ఎనిమిది నంది అవార్డులను అందుకుంది. అలానే ఉత్తమ దర్శకుడి పురస్కారంతో పాటు నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఒక్కడు సినిమా ఇచ్చిన అద్భుత విజయంతో మహేష్ బాబుతో అర్జున్, సైనికుడు సినిమాలను తెరకెక్కించాడు. మృగరాజు, చూడాలని వుంది, వరుడు, నిప్పు, సొగసు చూడ తరమా, లాఠీ లాంటి సినిమాలకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. 2015 లో విడుదలైన చారిత్రాత్మక సినిమా రుద్రమదేవి సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు పొంది.. మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఆయన ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె నీలిమ గుణ పెళ్లి కూతురుగా ముస్తాబై.. అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నీలిమ పెళ్లికి సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.