అనీల్ రావిపూడి.. టాలీవుడ్ లో రాజమౌళి తరహాలో ఫ్లాపులు లేని డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. 2015లో పటాస్ సినిమాలో డైరెక్టర్ గా తన మారిన అనీల్ రావిపూడి అప్పటి నుంచి మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. తన సినిమాలో యాక్షన్ కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందే.. కామెడీకి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో జంధ్యాల, ఈవీవీ తరహా డైరెక్టర్లులేని లోటును అనీల్ రావిపూడి భర్తీ చేస్తున్నాడు అనడంలో సందేహం లేదు. నిజానికి యాక్షన్ సినిమాలు చేద్దామనే వచ్చినా.. ప్రస్తుతానికి ఇండస్ట్రీలో ఖాళీ ఉన్న ప్లేస్ భర్తీ చేయాలనుకున్నట్లు అనీల్ చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా తనపై వచ్చే ట్రోలింగ్ విషయంలో అనీల్ రావిపూడి తొలిసారి స్పందించాడు. తనను కావాలనే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్లు తెలిపాడు. ఒక టీమ్ తనను నెగెటివ్ చేసేందుకు పనిచేస్తోందని.. ఆ విషయం తనకి కూడా తెలుసని చెప్పుకొచ్చాడు. అది వాళ్లకి ఒక ఎంటర్ టైన్మెంట్.. అది ఆపండి అని చేప్పే రైట్ తనకి లేదని తెలిపాడు. నిజానికి వాళ్లు చెప్పినట్లు తన సినిమాల్లో ఫాల్ట్ ఉంటే ఆడవు కదా అని ప్రశ్నించాడు.
తనపై ట్రోలింగ్ విషయంలో తనదైనశైలిలో స్పందించిన అనీల్ రావిపూడి ఓ ఉదాహరణ కూడా చెప్పాడు. ‘బ్రాహ్మణుల హోటల్ కు వెళ్లి నాన్ వెజ్ కావాలి అంటే ఎలా కుదరదు కదా? నా సినిమాలను కూడా ఎంజాయ్ చేసేవాళ్లు ఉన్నారు.. లెట్ దెమ్ ఎంజాయ్’ అంటూ అనీల్ రావిపూడి ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చాడు.
ఇంక F3 సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా మే 27న థియేటర్లలో విడుదల కానుంది. F2కి సీక్వెల్ అని చెప్పినా కూడా కథ మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. F2లోని అన్ని పాత్రలను వాడుకుంటూనే కొన్ని పాత్రలను కూడా పరిచయం చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత సునీల్ కడుపుబ్బా నవ్విస్తాడని చెబుతున్నారు. ఇంక రేచీకటితో వెంకటేశ్, నత్తితో వరుణ్ తేజ్ చేసే కామెడీ నెక్ట్స్ లెవల్ అంటున్నారు. F3 సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.