బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమాలు అంటే టాలీవుడ్‌లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్లో సంపూకు ఉన్న ఫాలోయింగ్ వేరే లెవెల్. ‘హృదయ కాలేయం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సంపూ ఆ తర్వాత పెద్ద హిట్ కొట్టలేదు. అయినా అతగాడి జోరే వేరు. అలాంటి సంపూ ఇప్పుడు బజార్ రౌడీగా మారిపోయాడు. ఇంతకు ముందు ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేసారు. సంపూ పాత్రను హైలైట్ చేస్తూ కట్ చేసిన యాక్షన్ విజువల్స్ బాగున్నాయి. డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
వెరైటీ టైటిల్స్‌తో ముందుకొస్తూ తన లక్ పరీక్షించుకుంటూనే ఉన్నాడు. ఇటీవల ‘కొబ్బరిమట్ట’ సినిమాతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ‘కాలీఫ్లవర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంపూ తాజాగా ‘బజార్ రౌడీ’ సినిమాతో ఫుల్ యాక్షన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో సంపూ బజార్ రౌడీ ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఎవరి వల్ల అయ్యాడు అనేది సినిమా చూస్తే అర్థమవుతుందట.
సాయాజీ షిండే, కత్తి మహేష్, కరాటే కళ్యాణి, షఫీ, పృధ్వీరాజ్, నాగినీడు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు డి.వసంత నాగేశ్వరరావు తెలిపారు.