బలగం సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన వేణు ఎల్దండికి దిల్ రాజు మరొక అవకాశం ఇచ్చారు. చిన్న బడ్జెట్ లో చిన్న సినిమా తెరకెక్కించి పెద్ద హిట్ అందించిన వేణుకి ఈసారి పెద్ద సినిమా చేసే అవకాశం ఇచ్చారు.
కమెడియన్ గా తనదైన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్వించిన వేణు టిల్లు.. ఒకే ఒక్క సినిమాతో ఇప్పుడు వేణు ఎల్దండిగా దర్శకుడిగా పరిచయమయ్యారు. దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన మున్నా సినిమాతో వేణు టిల్లుగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి హాస్యనటుడిగా తనకంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత జబర్దస్త్ లో చేరి అక్కడ కూడా తన పంచులతో నవ్వించారు. వేణు వండర్స్ టీమ్ లో ఎన్నో స్కిట్లు చేసి కడుపుబ్బా నవ్వించారు. అయితే కమెడియన్ గా సత్తా చాటిన వేణులో దర్శకుడు ఉంటారని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఊహించని విధంగా బలగం సినిమాతో దర్శకుడిగా వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు.
ఏదో అల్లా టప్పా సినిమా తీస్తారనుకుంటే తెలంగాణ సంస్కృతిని తెరపై చూపించే సత్తా ఉన్న సినిమా తీశారు. దర్శకుడిగా మొదటి సినిమాతోనే అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. చిన్న బడ్జెట్ లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకునే సినిమా తీశారు వేణు. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణ ప్రజలనే కాకుండా మిగతా ప్రాంతీయ ప్రేక్షకులను కూడా మెప్పించింది. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాని ఓన్ చేసుకుంటున్నారు. తెలంగాణలో అయితే పలు ప్రాంతాల్లో ఎప్పుడో 40 ఏళ్ల క్రితం విడిపోయిన కుటుంబాలు, స్థల వివాదం వచ్చి మాట్లాడుకోవడమే మానేసిన అన్నదమ్ములు ఇలా ఈ సినిమా చూసి ప్రభావితమయ్యి మళ్ళీ ఏకమవుతున్నారు. అంతలా ఈ సినిమా మనుషులను కలిపింది. అంత గొప్ప సినిమా కాబట్టే ఈ సినిమాకు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిన్న సినిమా ఇప్పుడు పెద్ద సినిమాగా పేరు తెచ్చుకుంది.
ఈ సినిమాతో వేణు ప్రతిభ ఏంటో బయటపడింది. దీంతో వేణుకు మరొక అవకాశం ఇచ్చారు దిల్ రాజు. చిన్న సినిమానే పెద్ద సినిమా స్థాయిలో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారంటే.. ఇక పెద్ద సినిమా చేసే అవకాశం ఇస్తే ఏ స్థాయిలో ఉంటుందో అని వేణుతో పెద్ద సినిమాకి రంగం సిద్ధం చేశారు. ఆల్రెడీ వేణు ఒక లైన్ చెప్పారని.. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఆ సినిమాని నిర్మిస్తానని దిల్ రాజు అన్నారు. ఈసారి తీయబోయేది పెద్ద సినిమా కాబట్టి పెద్ద బ్యానర్ లో నిర్మించాలని అనుకుంటున్నానని అన్నారు. ఈ సినిమా ఒక లెవల్ లో ఉంటుందని హింట్ ఇచ్చారు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. మరి రెండవ సినిమాతో వేణు ఎలాంటి వండర్స్ చేస్తారో చూడాలి. మరి వేణు తర్వాత ఎలాంటి సినిమా తీయబోతున్నారో గెస్ చేయండి. మీ గెస్ ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.