సెలబ్రిటీలు సినిమా ఈవెంట్స్ లోనే కాదు.. రెగ్యులర్ గా వారి పర్సనల్ లైఫ్ ని కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. వారి లైఫ్ లో విలువైన విషయాలను షేర్ చేసుకుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసిన ఎంజాయ్ చేసిన మూమెంట్స్, ఫ్యామిలీతో టూర్స్, అకేషన్స్ కి వెళ్లిన మూమెంట్స్ కూడా వాళ్ళ లైఫ్ లో ఎంతో ముఖ్యమైనవి. తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
సెలబ్రిటీలు సినిమా ఈవెంట్స్ లోనే కాదు.. రెగ్యులర్ గా వారి పర్సనల్ లైఫ్ ని కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు. వారి లైఫ్ లో విలువైన విషయాలను షేర్ చేసుకుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసిన ఎంజాయ్ చేసిన మూమెంట్స్, ఫ్యామిలీతో టూర్స్, అకేషన్స్ కి వెళ్లిన మూమెంట్స్ కూడా వాళ్ళ లైఫ్ లో ఎంతో ముఖ్యమైనవి. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సతీమణి తేజస్విని, కుమారుడు అన్వై రెడ్డి , సోదరుడు శిరీష్.. ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా శ్రీవారి సేవలో పాల్గొన్న దిల్ రాజు.. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడే దిల్ రాజు తనయుడు అన్వై రెడ్డి తల నీలాలను సైతం స్వామివారికి సమర్పించారు.
ఇక దర్శనం అనంతరం.. దిల్ రాజు కుటుంబానికి రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వాదాలు అందించారు. ఆ తర్వాత ఆలయ అధికారులు వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం దిల్ రాజు మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. “నేను నా బలగంతో శ్రీవారి దర్శనానికి వచ్చాను. గతవారమే ‘బలగం’ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మా చిన్న సినిమాకి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మేం కొత్తగా ప్రారంభించిన ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ నుండి మొదటి సినిమా ఇది. మా పిల్లలు హర్షిత్, హన్షితలకు నిర్మాతలుగా మొదటి సినిమా. సినిమా హిట్ అవ్వడంతో అందరం స్వామివారి దర్శనానికి వచ్చాం. మా ‘బలగం’ మూవీని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దిల్ రాజు తనయుడు అన్వై రెడ్డి ఈ వీడియోలో హైలెట్ గా మారాడు. మరి దిల్ రాజు నిర్మించిన బలగం సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.