తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, పూజా హెగ్డే నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘బీస్ట్’. ఏప్రిల్ 13న పాన్ ఇండియా స్థాయిలో తమిళ, తెలుగు భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ కాబోతుంది. అయితే.. ఈ సినిమాను తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దిల్ రాజు బీస్ట్ సినిమా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ హీరోయిన్ పూజా హెగ్డే పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘అందరికీ నచ్చేలా ఓ స్క్రిప్ట్‌ను తయారు చేసుకుని సినిమాను సక్సెస్ చేయడమనేది డైరెక్టర్‌కి ఎంతో కష్టమైన పని. అలాంటిది నెల్సన్ గారు రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుని కమర్షియల్ హిట్స్ కొడుతున్నారు. అనిరుద్ కి హ్యాట్సాఫ్. మీరు కంపోజ్ చేసిన అరబిక్ కుత్తు పాటకి ప్రపంచం అంతా డాన్సులు చేస్తుంది.ఇక హీరోయిన్ పూజా మన కాజా.. ఆమె లెగ్గుపెడితే సూపర్ హిట్టే. డీజే, మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠపురములో సూపర్ హిట్ అయ్యాయి. బీస్ట్ మూవీ ఆల్రెడీ సూపర్ హిట్. నాకు మరో సూపర్ హిట్ కావాలి. పూజా డేట్స్ ఇస్తే బావుంటుంది. ఆమె తెలుగు, తమిళం, హిందీ.. ఇలా ప్రతి భాషలోనూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. డాన్సులే కాదు.. పెర్ఫామెన్స్ పరంగా ప్రతి సినిమాకు ఎదుగుతూ వస్తుంది” అంటూ చెప్పారు. ప్రస్తుతం దిల్ రాజు మాట్లాడిన ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.