దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించి రికార్డులు తిరగరాసిన RRR సినిమా.. ఇంకా బాక్సాఫీసు వద్ద తొక్కుకుంటూ పోతోంది. ఈ సినిమాతో రాజమౌళి-రామ్ చరణ్- తారక్ రేంజ్ ఇంకో లెవల్ కు చేరుకుంది. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా గురించే టాక్ నడుస్తోంది. విడుదలై మూడు వారాలు దాటినా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సినిమా సంగతి పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ వార్త.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే తారక్ నేషనల్ లెవల్ బ్యాడ్మింటన్ ప్లేయర్.. అవును మీరు చదివింది నిజమే.. ఆ విషయం చాలా మందికి తెలియదు. స్వయంగా ఎన్టీఆర్ వెల్లడించడంతో నమ్మక తప్పడం లేదు.
జూనియర్ ఎన్టీఆర్ గల్ఫ్ మీడియాకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగతం, తల్లి గురించి చాలా విషయాలు ప్రస్తావించాడు. ‘మా అమ్మ నన్ను క్లాసికల్ డాన్స్ నేర్చుకోమంది. ఒక మంచి కూచిపూడి నృత్యకారుడిని అయ్యాను. మా అమ్మ నన్ను ఆటలాడమంది. నేను నేషనల్ లెవల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యాను. కానీ, చివరకు నేనూ ఊహించని రీతిలో నటుడిగా మారిపోయాను’ అంటూ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యల్లో ఎన్టీఆర్ కు తల్లిపై ఉన్న ప్రేమ, ఆమె కోరిక నెరవేర్చాలనే తపన మాత్రమే కాకుండా.. జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ప్లేయర్ అనే విషయం బహిర్గతమైంది. తారక్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
One & Only All Rounder Of Indian Cinema 💥
Jai NTR ✊#ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/08qZrTCXL5
— NTR Trends Team ᵀʰᵒᵏᵏᵘᵏᵘⁿᵗᵘᵖᵒᵛᵃᵃˡᵉ 🌊 (@TeamNTRTrends) August 28, 2021
ఇది కూడా చదవండి: మొట్టమొదటి సారి హనుమాన్ దీక్ష తీసుకున్న Jr.NTR?