ఇదివరకంటే స్టార్డమ్ చూసి సినిమాలను ఇతర భాషల్లోకి డబ్ చేసేవారు. కానీ.. ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. కంటెంట్ ప్రధానంగా సినిమాలను ఇతర భాషలలో రిలీజ్ చేసి హిట్స్ కొడుతున్నారు. ప్రారంభంలో వీడు హీరో ఏంటని కామెంట్స్ చేసిన వారంతా.. ఇప్పుడు ధనుష్ సినిమా రిలీజ్ ఎప్పుడు? అని ఎదురు చూసేలా చేశాడు..
సినీ ఇండస్ట్రీలో భాషల పరంగా హద్దులు చెరిగిపోయాయి. పాన్ ఇండియా కల్చర్ వచ్చినప్పటి నుండి హీరోలంతా అన్ని భాషలపై ఫోకస్ పెడుతున్నారు. ఇదివరకంటే స్టార్డమ్ చూసి సినిమాలను ఇతర భాషల్లోకి డబ్ చేసేవారు. కానీ.. ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. కంటెంట్ ప్రధానంగా సినిమాలను ఇతర భాషలలో రిలీజ్ చేసి హిట్స్ కొడుతున్నారు. అలా మెల్లగా ఒక్కో భాషలో తమ ఫ్యాన్ బేస్ డెవలప్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో ధనుష్ ఆ కోవకే చెందుతాడని చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో వీడు హీరో ఏంటని కామెంట్స్ చేసిన వారంతా.. ఇప్పుడు ధనుష్ సినిమా రిలీజ్ ఎప్పుడు? అని ఎదురు చూసేలా చేశాడు.. ఇన్స్పైరింగ్ గా నిలిచాడు.
ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు.. దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేదు. పేరుకు తమిళ హీరో అయినప్పటికీ.. తెలుగు, తమిళ, హిందీ భాషలలో తనకంటూ స్పెషల్ క్రేజ్, ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. కోలీవుడ్ నుండి ఇప్పటిదాకా విక్రమ్, విజయ్, సూర్య, కార్తీ, అజిత్ లాంటి హీరోలు వారి సినిమాలను తెలుగులో చేసి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇన్నేళ్లయినా వారంతా తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయలేదు. అలాగని ఆ లిస్ట్ లో ధనుష్ ఏం మినహాయింపు కాదు. ముందు డబ్బింగ్ సినిమాలతో పలకరించినా.. తాజాగా ‘సార్’ సినిమాతో తెలుగులో డెబ్యూ చేశాడు. ఓ రకంగా ఇది స్ట్రయిట్ తెలుగు మూవీ. అయినప్పటికీ, తమిళంలో కూడా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అయ్యింది.
ముందునుండే మినిమమ్ అంచనాలు సెట్ చేసిన ఈ సినిమాకు ప్రీమియర్స్ నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇంకా మున్ముందు మౌత్ టాక్ స్ప్రెడ్ అయి.. సినిమాకు సాలిడ్ కలెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ధనుష్ పెర్ఫార్మన్స్ ఐ ఫీస్ట్ అని.. మిగతా నటీనటుల నటనకు కూడా సినిమాకి ప్లస్ అయ్యిందని పబ్లిక్ టాక్ చూస్తే తెలుస్తోంది. సినిమాని మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడని అంటున్నారు. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాని.. సితార ఎంటర్టైన్ మెంట్స్ వారు నిర్మించారు. మరి వినిపిస్తున్న పాజిటివ్ టాక్ బట్టి.. ధనుష్ కి తెలుగులో సాలిడ్ డెబ్యూ లభించిందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ధనుష్ కి ఉన్న ఇమేజ్ కి.. సార్ ఇంకా ప్లస్ అవుతుందని.. మరి ఫ్యూచర్ సినిమాలు కూడా ఇలాగే ప్లాన్ చేసుకుంటే ధనుష్ కి తెలుగులో ఢోకా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ధనుష్ గురించి, సార్ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.