ప్రస్తుతం ఇండస్ట్రలో పెళ్లి పిలుపులు ఎక్కువయ్యాయి. కొన్ని రోజుల క్రితమే హీరో ఆది పినిశెట్టి-నిక్కీ గల్రానీల వివాహం జరగ్గా.. తాజాగా మరో నటి పెళ్లి పీటలు ఎక్కింది. ప్రస్తుతం ఆమె పెళ్లి వీడియో వైరల్ అవుతోంది. ఇంతకు ఈ పెళ్లి చేసుకున్న నటి ఎవరంటే.. దేవత సీరియల్ ఫేమ్ వైష్ణవి. తన పెళ్లి వేడుకకు సంబంధించి ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్‌లో వరుస వీడియోలను షేర్ చేస్తూ ఉంది వైష్ణవి. నిశ్చితార్ధం మొదలు.. తన ఐదురోజుల పెళ్లి వరకూ ప్రతి వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేయడంతో వైష్ణవి ఇప్పుడు యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఆమె పెళ్లికి సంబంధించిన ప్రతి వీడియో మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టడంతో వైష్ణవి ట్రెండింగ్ లో నెంబర్ 1 గా నిలిచింది.
ఈ ఏడాది మే 25న బుధవారం రాత్రి 9.19 నిమిషాలకు శంషాబాద్‌లో వైష్ణవి వివాహం ఘనంగా జరిగింది. కరీంనగర్‌కి చెందిన సురేష్ కుమార్‌తో వైష్ణవి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక వైష్ణవి, సురేష్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉండగా.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కారు. సురేష్ ఎవరో కాదు.. ప్రస్తుతం మా టీవీలో ప్రసారం అవుతున్న ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్ దర్శకుడే ఈ సురేష్. ఇద్దరూ ఇండస్ట్రీకి చెందిన వారే కావడంతో ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం ప్రేమగా మారి ఇలా పెళ్లి పీటలు ఎక్కారన్నమాట.
ఇది కూడా చదవండి: Gully Boys Fame Riyaz: వివాహం చేసుకున్న గల్లి బాయ్స్ ఫేమ్ రియాజ్.. నెట్టింట వైరలవుతోన్న ఫోటో!
ఇక ప్రస్తుతం ‘దేవత’ సీరియల్‌లో ఆదిత్య భార్యగా.. రుక్మిణి చెల్లిగా ఇప్పుడు కన్నడ నటి మాన్సీ జోషి.. కనిపిస్తుంది కానీ అంతకు ముందు సత్య పాత్రలో కనిపించింది వైష్ణవి. లాక్ డౌన్ టైంలో ఆ సీరియల్ నుంచి వైష్ణవి తప్పుకోవడంతో.. ఆమె ప్లేస్‌లో మాన్సీ జోషి వచ్చింది. ప్రస్తుతం వైష్ణవి సీరియల్స్‌కి దూరంగా ఉండి.. పర్సనల్ లైఫ్‌తో బిజీగా ఉంది. అయితే సీరియల్స్ నుంచి గ్యాప్ వచ్చిన తరువాత యూట్యూబ్‌లో ఫుల్ బిజీ అయ్యింది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను యూట్యూబ్‌లో షేర్ చేస్తూ మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతూ ట్రెండింగ్‌లో ఉంటుంది వైష్ణవి. ఈ పెళ్లి వీడియోతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Poorna: కాబోయేవాడిని పరిచయం చేసిన హీరోయిన్ పూర్ణ. ఇంతకు ఎవరీ అసిఫ్ అలీ?