టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. గుడ్ లుకింగ్ హీరో మాత్రమే కాకుండా మంచి టాలెంట్ ఉన్న కుర్ర హీరో. టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో నాగశౌర్య కూడా ఒకడు. కానీ, ఇప్పుడు అలా పిలిచే అవకాశం లేదు. ఎందుకంటే హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ నెల 20న 11.25 గంటలకు వివాహ బంధంతో తన జీవితంలో ఓ నూతన అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైపోయాడు. బెంగళూరులోని ఓ హోటల్లో ఈ వివాహం జరగనుంది. ఇప్పటికే నాగశౌర్య ఫ్యామిలీ పెళ్లి పనులు కూడా ప్రారంభించేశారు. పెళ్లి పత్రికలు పంచడం స్టార్ట్ చేశారు. వెడ్డింగ్ కార్డ్స్ అందరూ సాంప్రదాయ దుస్తుల్లో వివాహానికి హాజరు కావాలంటూ కోరుతున్నారు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఆ అమ్మాయి ఎవరు? ఏం చేస్తుంది? వాళ్లకి ఎలా పరిచయం? అంటూ చాలానే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్న అనూష శెట్టి ఎవరో చూద్దాం. అనూష శెట్టి కర్ణాటకు చెందిన అమ్మాయి. వారితి మంగళూరు సమీపంలోని కుందాపూర్. ఆమె ఒక ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. అంతేకాదు ఉమెన్ అచీవర్స్ లో ఒకరిగా గుర్తింపు కూడా సంపాదించుకున్నారు. ఆర్కిటెక్ట్ గా 2019-20 సంవత్సరానికి బెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. నాగశౌర్యకు ఆమెతో కొంతకాలంగా పరిచయం ఉందని తెలుస్తోంది. వారి పరిచయం ప్రేమగా మారగా పెద్దలు కూడా అంగీకరించినట్లు చెబుతున్నారు.
అనూష శెట్టికి బెంగళూరులో అనూష శెట్టి డిజైన్స్ అనే ఒక సంస్థ కూడా ఉంది. ఇంటీరియర్ డిజైనింగ్‌లో వారికి మంచి పేరుంది. ఎంతో లగ్జరీ రెసిడెన్షియల్ ఇంటీరియర్ డిజైన్ చేయడంలో వారు ప్రత్యేకమంటూ చెబుతున్నారు. వారి సంస్థ గురించి మాట్లాడుతూ.. డిజైన్ అనేది కనిపించేదే కాదు.. అది ఎలా పనిచేస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు. ఎలాంటి కట్టడాన్ని అయినా తాము అద్భుతమైన భవంతిలా మార్చేస్తామంటూ తెలిపారు. నాగశౌర్యకు పెళ్లి ఫిక్స్ అవడంపై టాలీవుడ్ ప్రముఖుల నుంచి ఫ్యాన్స్ వరకు అంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు అంటూ అతని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.