జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు పాలిటిక్స్ లో, మరోవైపు సినిమాలలో యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్నికల ప్రచారం కోసం వారాహి అనే వాహనాన్ని తయారు చేయించుకున్నారు పవన్. అయితే.. పవన్ ప్రచార వాహనం అయినటువంటి వారాహికి తెలంగాణ రవాణాశాఖ పర్మిషన్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసమని వారాహి గ్రీన్ కలర్ తో సిద్ధం చేశారు. దీంతో వారాహి రంగు.. మిలటరీ వారు వాడే వాహనాల రంగుని పోలి ఉందని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అలా వారాహి విషయం కాస్త రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో విమర్శలు వారాహిపై విమర్శలు వచ్చేసరికి రిజిస్ట్రేషన్ వాయిదా పడిందని వార్తలొచ్చాయి. ఆర్మీ వాహనాలకు తప్ప ప్రైవేటు వ్యక్తులు ఎవరూ ఆలివ్ గ్రీన్ కలర్ ని వాహనాలకు ఉపయోగించరాదని చట్టాలు చెబుతున్నాయి. అయితే.. వారాహి గురించి వచ్చిన వార్తలన్నిటికీ చెక్ పెడుతూ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు క్లారిటీ ఇచ్చారు. అన్ని నిబంధనలకు అనుగుణంగానే వారాహి రంగు ఉందని, వారాహికి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ వాడినట్లు తెలిపారు. అంతేగాక ఆలివ్ గ్రీన్ కి, ఎమరాల్డ్ గ్రీన్ కి మధ్య తేడా పెద్దగా కనిపించదని.. వెహికల్ బాడీ బిల్డర్ ఇచ్చిన సర్టిఫికెట్ ను పరిశీలించి పర్మిషన్ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
ఇక వారాహి గురించి డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు ఇంకా మాట్లాడుతూ.. వారాహికి వారం రోజుల కిందటే రిజిస్ట్రేషన్ చేయించారు. TS 13 EX 8384 పేరుతో వారాహిని రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే.. ఈ వారాహి నెంబర్ కోసం నిబంధనలు అనుగుణంగా పే చేసి తీసుకున్నారు. 8384 నెంబర్ కోసం రూ. 5000 కట్టి తీసుకున్నారు. సాధారణంగా స్పెషల్ నెంబర్స్ అనేవి ఈజీగా అలాట్ కావు. గవర్నమెంట్ కి ఐదు వేలు కట్టి కావాల్సిన నెంబర్ తీసుకోవచ్చు. ఈ వారాహికి కూడా అంతే కట్టి తీసుకున్నారు” అని అన్నారు. ప్రస్తుతం వారాహి గురించి డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి వారాహి గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.
Chief @PawanKalyan’s Election Tour Vehicle “Varahi” registration has been completed today.
Registered No. TS13EX 8384
Vehicle Body Colour: Emerald Green #VarahiForElectionBattle pic.twitter.com/kNQPMvSS39
— JanaSwaram News (@JanaswaramNEWS) December 12, 2022