బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్న సోషల్ మీడియా స్టార్స్ లో దీప్తి సునైనా ఒకరు. సోషల్ మీడియాలో 3 మిలియన్లకు పైగా ఫాలోయర్స్ కలిగిన దీప్తి యూట్యూబ్ ఛానల్ కి మిలియన్స్ లో సబ్ స్క్రైబర్స్ ఉండటం విశేషం. యూట్యూబర్ గా స్టార్ట్ అయిన ఈ బ్యూటీ.. ఇంస్టాగ్రామ్ లో మిలియన్ల ఫ్యాన్స్ కలిగి సినిమా తారలకు సమానంగా క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇక సోషల్ మీడియాలో ఇంతటి పాపులారిటీ కలిగిన దీప్తి ఎప్పుడెప్పుడు సినిమాల్లో కనిపిస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మాములుగా అయితే సోషల్ మీడియాలో కాస్త ఫాలోయింగ్ రాగానే సినిమాల్లో అడుగు పెడదాం అని ఆలోచిస్తుంటారు. కానీ దీప్తి అలా చేయకుండా సోషల్ మీడియా, యూట్యూబ్ వరకే పరిమితమై ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే.. దీప్తి లవ్ మేటర్ గురించి అందరికి తెలిసిందే.
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ తో 5 ఏళ్ళ లవ్ కి బ్రేకప్ చెప్పుకున్నారు. బ్రేకప్ అయిన వెంటనే ఇద్దరూ కూడా ఎవరి కెరీర్ లో వారు బిజీ అయిపోయారు. ఇక ఎలాగో సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ స్టయిలిష్ ఫోటోషూట్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా దీప్తి చేసిన గ్లామరస్ ఫోటోషూట్ నెట్టింట వైరల్ అవుతోంది. మున్నార్ హిల్ స్టేషన్ లో షార్ట్ బ్లాక్ వేర్ లో దీప్తి ఫొటోస్ ట్రెండ్ అవుతున్నాయి. పీస్ అంటూ హాట్ లుక్ లో రూట్ మార్చిందని చెప్పకనే చెబుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.