తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న షో ‘బిగ్ బాస్’. టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్ తో దూసుకపోతున్న షోల్లో ఇది ఒకటి. బిగ్ బాస్ మొదట హిందీ భాషలో ప్రసారమైంది. అక్కడ మంచి ఆదరణ పొందింది. అనంతరం వివిధ భాషల్లో కూడా మొదలై.. విజయవంతగా సాగుతోంది. తెలుగులోనూ మంచి ప్రేక్షకాదరణతో దూసుకుపోతుంది. ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. 6వ సీజన్ లోకి అడుగు పెట్టింది. ఈ ఆరవ సీజన్ కోసం బిగ్ బాస్ హౌస్ సిద్దమైంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ షో త్వరలో ప్రారంభం కానుంది. బిగ్ బాస్ సీజన్-6 సంబంధించి కూడా పలు ప్రోమోలు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈక్రమంలో హౌస్ లోకి వెళ్లే సభ్యుల విషయంలో ఇప్పటికే పలువురి పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అలా వినిపిస్తోన్న పేర్లలో దీపికా పిల్లి కూడా ఒకరు. అయితే చివరి నిమిషంలో బిగ్ బాస్ దీపికా కు షాక్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
దీపిక పిల్లి టిక్ టాక్ వీడియోలతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అనంతరం పలు టీవీషోల్లో యాంకర్ గా చేస్తూ.. మంచి క్రేజ్ సంపాదించింది. ఢీ షోల్లో హైపర్ ఆదితో కలసి ఫుల్ ఎంటర్ టైన్ చేసింది. ఇటీవల ‘కామెడీ స్టార్స్’ లో సైతం హోస్ట్ గా వ్యవహరించి అందరి ఆకట్టుకుంది. అలానే దీపిక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. దీపిక పిల్లికి యువత లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల సుడిగాలి సుధీర్ నటించిన ‘వాంటెడ్ పండుగాడు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఇక ఈ అమ్మడి ఉన్న క్రేజ్ కారణంతో ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకు వెళ్తుందని వార్తలు వినిపించాయి. అయితే దీపిక కాకు బిగ్ బాస్ షాక్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ అమ్మడి స్థానంలో మరో యాంకర్ ని హౌస్ లోకి పంపనున్నట్లు తెలుస్తోంది. దీపిక స్థానంలో హౌస్ లోకి వెళ్లనున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. యాంకర్ వర్షిణీ. ఈ బ్యూటీ కూడా అనేక షోల్లో యాంకర్ గా వ్యవహరిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అంతే కాక పలు సినిమాలో కూడా నటించింది.
అయితే ఇప్పుడు దీపికా ప్లేస్ లో వర్షిణి హౌస్ లోకి వెళ్లనుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. దీపిక వెళ్లకపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. బిగ్ బాస్ హౌస్ లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ని వెళ్లనున్నారు. వారు ఎవరు అనేది త్వరలోనే తెలియనుంది. మరి.. దీపిక విషయంలో వస్తోన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.