ప్రతి మనిషి జీవితంలో ఉండే సర్వసాధారమైన కోరిక సొంత ఇల్లు. తాను మరణించేలోపు తమ కంటూ ఓ సొంతంగా ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి సొంత ఇంటి నిర్మాణం చేపడతారు, లేదంటే కొనుక్కుంటారు. అయితే అంత ముచ్చటపడి కట్టుకున్న, కొనుక్కున్న ఇల్లు.. గృహప్రవేశం జరిగిన కొన్ని రోజులకే కూలిపోతే.. హార్ట్ ఎటాక్ వచ్చినంత పనవుతుంది కదా. ఇదుగో ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది నటి నవీనాకు. ఎంతో ఖర్చు చేసి.. ముచ్చటపడి కట్టుకున్న ఇల్లు భారీ వర్షాల కారణంగా కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. నాలుగు అంతస్తులుగా నిర్మించిన ఈ బిల్డింగ్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నాలుగో ఫ్లోర్ కూలిపోయింది. బిల్డర్ తమను మోసం చేశాడని.. తమకు కూడా కన్స్ట్రక్షన్ గురించి పూర్తిగా తెలియకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పుకొచ్చింది. ఫలితంగా తమకు 7-8 లక్షల రూపాయల నష్టం, మెంటల్ స్ట్రెయిన్ అని చెప్పుకొచ్చింది. బిల్డర్ తమ వద్ద నుంచి కోటి రూపాయలు తీసుకుని.. నాసిరకం పనులు చేసి అందులో సగం డబ్బు మిగుల్చుకున్నాడని.. ఫలితంగా తమకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటి నిర్మాణం చేపట్టే వారు.. తనలా మోసపోకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకోమని కోరింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి రోడ్డున పడ్డ బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్ళే.. ఇది కూడా చదవండి: చమ్మక్ చంద్ర కాళ్లపై పడిన రచ్చ రవి.. ఎమోషనల్ వీడియో!