సినిమా అనేది రంగుల ప్రపంచం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తే ప్రపంచంలో ఉన్న అన్ని రంగులూ వీరి దగ్గరనే ఉంటాయి. కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తే ఇక డార్క్ కలర్ తప్ప జీవితంలో ఇంకే రంగు ఉండదు. వచ్చినవన్నీ వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతాయి. సినిమా ఇండస్ట్రీలో ఒకానొక దశలో స్టార్స్‌గా వెలిగిన చాలా మంది జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఆస్తులు పోగొట్టుకుని చేతిలో చిల్లిగవ్వ లేక చివరి దశలో నరకం అనుభవించారు. బిగ్గర్ టూ బెగ్గర్ స్టేజ్‌కి పడిపోయిన సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. ఓపీ నయ్యర్: దీనికి బాలీవుడ్ సెలబ్రిటీలేమీ అతీతం కాదు. ఆసియా యొక్క రిథమ్ కింగ్‌గా పేరు ప్రఖ్యాతులు గాంచిన ఓపీ నయ్యర్ ఒకానొక దశలో సినీ పరిశ్రమలో రారాజుగా ఉన్నారు. మ్యూజిక్ కంపోజర్‌గా, సింగర్‌గా, సాంగ్ రైటర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందించిన ఓపీ నయ్యర్ తాగుడుకి బానిసై జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కుటుంబాన్ని వదులుకున్నారు. డబ్బు కోసం, మందు కోసం ఇంటర్వ్యూలు ఇచ్చే స్థితికి వచ్చారు. తన మరణానికి ముందు అంత్యక్రియలకు రాకూడదని తన కుటుంబాన్ని నిషేధించారు. అచల సచ్దేవ్: ఫ్యాషనబుల్ వైఫ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అచల సచ్దేవ్ ఎక్కువగా యశ్ రాజ్ సినిమాల్లో నటించారు. 130కి పైగా హిందీ సినిమాల్లో నటించిన ఈమె ఇండియా, పాకిస్తాన్ పార్టీషన్ జరగక ముందు లాహోర్‌లో ఆలిండియా రేడియోలో పనిచేశారు. ఆ తర్వాత ఢిల్లీ ఆలిండియా రేడియోలో పనిచేశారు. అయితే భర్త చనిపోయిన తర్వాత ఆమె తన పిల్లలని విడిచి కొన్నాళ్ళు ఒంటరిగా జీవించారు. దురదృష్టవశాత్తు ఈమె తన ఇంట్లోని వంట గదిలో జారిపడి మృతి చెందారు. పూణె హాస్పిటల్లో జాయిన్ అయిన ఆమె తన మెదడుకి ఫ్రాక్చర్ అవ్వడంతో ఆమె బతకడం కష్టమైంది. అయితే ఆమె అంత్యక్రియలకు ఆమె పిల్లలు కూడా రాలేదు. పర్వీన్ బాబి: సినిమా వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్‌కి గురవుతుంటారు. 1970, 80ల్లో బాలీవుడ్‌ని షేక్ చేసిన పర్వీన్ బాబి తీవ్ర డిప్రెషన్‌కి గురయ్యారు. చాలా కాలం పాటు ఈమె ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఉన్నట్టుండి ముంబైలోని ఫ్లాట్‌లో మృతి చెందారు. రెండు రోజులైనా మృతదేహాన్ని తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ కలగజేసుకుని ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మీనా కుమారి: 1940,60ల మధ్య కాలంలో ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించిన బాలీవుడ్ నటి మీనా కుమారి. గుండెలు బాదుకునేంతగా అభిమానం సంపాదించుకున్న ఈమె తన జీవితంలో ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారు. అది ఆమె జీవితాన్నే మార్చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కమల్ అమ్రోహి నుండి విడిపోయాక మద్యానికి బానిస అయ్యారు. లివర్ పూర్తిగా దెబ్బతినడంతో లండన్‌లో చికిత్స చేయించుకున్నారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో కోమాలోకి వెళ్ళిపోయారు. కోమాలోకి వెళ్ళిన రెండు రోజుల తర్వాత ఆమె మరణించారు. అప్పుడు ఆమె వయసు 38. చిన్న వయసులోనే ఆమె మరణించడం అభిమాన లోకాన్ని శోకంలో ముంచేసింది. రాజ్ కిరణ్: బాలీవుడ్ స్టార్ హీరో రిషి కపూర్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన రాజ్ కిరణ్ అనే బాలీవుడ్ నటుడు అట్లాంటలో మతి స్థిమితం లేని స్థితిలో పడున్నారు. ఇండస్ట్రీకి దూరమైన రాజ్ కిరణ్ కోసం అతని సహ నటుడు రిషి కపూర్ ఏమైపోయారో తెలుసుకోవాలనుకున్నారు. చివరకి అతని సోదరుడికి ఫోన్ చేసి కనుక్కోగా అట్లాంటలో మతి స్థిమితం కోల్పోయి ఉన్నారని తెలిసింది. అంతకు మించి వివరాలు ఇవ్వలేదు. అతను ఏమైపోయారో ఎవరికీ తెలియదు. రాజ్ కిరణ్ మిస్ అవ్వడం ఎప్పటికీ మిస్టరీ అని రిషికపూర్ అప్పట్లో లేఖ రాశారు. మిథాలి శర్మ: భోజ్‌పురి నటి మిథాలి శర్మ ఒకానొక టైమ్‌లో మంచి సినిమాలు చేశారు. సడన్‌గా అవకాశాలు రాకపోవడంతో ఆమె తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ముంబై వీధుల్లో బెగ్గర్‌గా మారాల్సి వచ్చింది. ఇటీవలే ఆమె దొంగతనం చేయడానికి ప్రయత్నించగా ఇద్దరు మహిళా పోలీసులు అడ్డుకున్నారు. అయితే మిథాలి శర్మ పోలీసులను కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత బెగ్గర్‌గా దర్శనమిచ్చారు. భగవాన్ దాదా: ఖరీదైన కార్లకి, లగ్జరీ బంగ్లాలకి పెట్టింది పేరు భగవాన్ దాదా. అంత రిచ్‌గా బతికిన ఈ బాలీవుడ్ నటుడు చివరకి సాధారణ కూలీలు ఉండే ముంబై స్లమ్‌లో మరణించే పరిస్థితి వచ్చింది. ఈయన నటించిన ఝమేలా, లబేలా సినిమాలు డిజాస్టర్ కావడంతో ఆయన పతనం మొదలైంది. అదృష్టం ఆవగింజంత అయిపోయింది. దీంతో ఆయన ఆస్తులతో పాటు జీవితం కూడా పోయింది. ముంబై వీధుల్లో ఇతని అధ్యాయం ముగిసింది. భరత్ భూషణ్: మూసలో వెళ్తున్న రొమాంటిక్ పాత్రలకి ఒక కొత్త రంగు అద్దినటువంటి హీరో భరత్ భూషణ్. ఇతని తప్పల్లా మీనా కుమారిని ప్రేమించడమే. ఆమె చెడు అలవాట్లను భరిస్తూ వచ్చారు. చివరికి సినిమాలు మానేసి ఫిల్మ్ స్టూడియో దగ్గర గేట్ కీపర్‌గా పనిచేశారు. ఒక్కడే ఒక అపార్ట్మెంట్లో ఉండేవారు. చివరికి అదే అపార్ట్మెంట్లో మృతి చెందారు. గీతాంజలి నాగ్‌పాల్: ఫ్యాషన్ మోడల్‌గా ప్రయాణం మొదలుపెట్టిన గీతాంజలి నాగ్‌పాల్ యొక్క చెడు అలవాట్ల వల్ల ఆమె జీవితమే నాశనమైంది. ర్యాంప్ వాక్ చేయాల్సిన ఆమె చివరకి నడి రోడ్డు మీద వాక్ చేయాల్సి వచ్చింది. డ్రగ్స్‌కి, మద్యానికి బానిస అవ్వడం వల్ల బంధాలను కోల్పోయారు. చివరికి ర్యాంప్ మీద ఉండాల్సిన ఆమె జీవితం రోడ్డు మీదకొచ్చేసింది. సౌత్ ఢిల్లీ వీధుల్లో ముష్టి ఎత్తుకోవడం మొదలుపెట్టారు. పనిమనిషిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె మానసిక చికిత్స పొందుతున్నారు. జగదీశ్ మాలి: బాలీవుడ్లో టాలెంటెడ్ ఫోటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న జగదీశ్ మాలి కూడా బిగ్గర్ నుంచి బెగ్గర్ స్టేజ్‌కి వచ్చేశారు. సుమంత్ నటించిన ప్రేమ కథ సినిమా హీరోయిన్ అంతర మాలి తండ్రి ఈ జగదీశ్ మాలి. ముంబై అంధేరి వీధుల్లో హాఫ్ నేకెడ్గా భిక్షాటన చేస్తూ సల్మాన్ ఖాన్ కంట పడ్డారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ అతనికి సహాయం చేశారు. అయితే 15 ఏళ్ళుగా డయబెటిస్, అధిక రక్తపోటు, కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జగదీశ్ 59 ఏళ్ళ వయసులో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఇలా ఒకానొక టైమ్‌లో స్టార్లుగా రాణించిన వీళ్ళంతా తాగుడికో లేదా డిప్రెషన్ కారణంగానో తమ అందమైన జీవితాలను నాశనం చేసుకున్నారు. ఎంత బిగ్గర్ అయినా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే బెగ్గర్గానే మిగిలిపోవాల్సి వస్తుంది. మరి బిగ్గర్ టూ బెగ్గర్ స్టేజ్కొచ్చేసిన ఈ సెలబ్రిటీలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి. ఇది కూడా చదవండి: హెరాస్ చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ఫిర్యాదు.. వేట మొదలైందంటూ ట్వీట్.. ఇది కూడా చదవండి: మైండ్ బ్లాంక్ చేస్తోన్న తెలుగు యాంకర్స్ రెమ్యునరేషన్స్..