సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు వారి వారి క్రేజ్ ను బట్టి రెమ్యునరేషన్స్ ఉంటుంది. కొంత మంది హీరోయిన్లు హీరోలతో సమానంగా పారితోషకం తీసుకుంటున్నారు. ఇక వెండి తెర నుంచి బుల్లితెర వైపు చూస్తే.. టీవీ నటులు కూడా బాగా సంపాదిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వీళ్లు తీసుకునే పారితోషకం ముందు హీరోయిన్ల సంపాదన కూడ సరిపోదు. అయితే ప్రస్తుతం చాలా మంది నటీనటులు బుల్లితెరపై మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. ఇక తెలుగులో టాప్ లో ఉన్న యాంకర్స్, నటీమణులు పారితోషికం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. యాంకర్లు, టీవీ నటులు.. తమ క్రేజ్ ను బట్టి.. ఎపిసోడ్ కు ఇంతా, సీరియల్ కి ఇంతా అని ఉంటుంది. ఇక యాంకర్లలో మొదటగా చెప్పుకోవాల్సిన పేరు సుమ. అనేక షోల్లో హోస్ట్ గా వ్యవహరిస్తూ.. తనదైన మాటలతో అందరిని ఆకట్టుకుంటుంది. షోలకు తోడు ఆడియో వేడుకలకు కూడా వ్యాఖ్యతగా వ్యవహరిస్తుంది. అయితే ఒక్కో ఆడియో ఫంక్షన్కు దాదాపు రూ. 2-రూ.2.5 లక్షల తీసుకుటుందని టాక్. ఇది కేవలం ఆడియో ఫంక్షన్ మాత్రమే.. అవార్డు ఫంక్షన్, టీవీ షోలకు అయితే పారితోషకం మరోలా ఉంటుందట. ఇక అనసూయ విషయానికి వస్తే ఈమె ఒక్కో ఈవెంట్కు దాదాపు రూ. 2 లక్షలు తీసుకుంటుందని రూమర్స్ వినిపిస్తోన్నాయి. అనసూయ టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంది. వీటికి తోడు సినిమాలు కూడా చేస్తుంది. జబర్దస్థ్ యాంకర్ రష్మీ గౌతమ్ కు కూడా క్రేజ్ బాగానే ఉంది. ఈ అమ్మడు పలు ఈవెంట్స్ లో పాల్గొన్ని సందండి చేస్తుంది. ఈ భామ రెమ్యునరేషన్ దాదాపు రూ. 1.5పైనే ఉందని టాక్. రష్మీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కార్తీక దీపంలో వంటలక్క బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రేమి విశ్వనాథ్.. గతంలో రూ.30 వేలు పారితోషకం తీసుకునేది. అయితే ఇప్పుడు రూ.50 వేలకు పెంచినట్లు రూమర్స్ వినిపిస్తోన్నాయి. బుల్లితెర రాములమ్మగా పేరు యాంకర్ శ్రీ ముఖి తెచ్చుకున్నారు. బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడి రేంజ్ కూడా బాగానే పెరిగిపోయింది. ఈమె ఒక్కో ఈవెంట్కు దాదాపు రూ. లక్ష వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీముఖి టీవీ షోలతో పాటు సినిమాల్లో నటిస్తోంది. యాంకర్ మంజుష కూడా ఒక్కో ఈ వెంట్ కు రూ.50 వేల వరకు తీసుకుంటున్నాదని టాక్. ఇక మరో యాంకర్ శ్యామల కూడా ఒక్కో ప్రోగ్రామ్ కి రూ.40వేల నుంచి రూ.50 తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలా మరికొందరు యాంకర్స్, నటీమణుల పారితోషికాలు సినిమాల్లో నటించే వారికి పోటీగా ఉన్నాయి. మరి.. ఈ బుల్లితెర నటీమణుల పారితోషకాలపై వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: రాధేశ్యామ్ ట్రైన్ సీన్! స్టూడియోలో సెట్ వేసి, గ్రాఫిక్స్ చాలా బాగా చేశారు! ఇదీ చదవండి: ‘ఆంటీ అన్నందుకు సారీ అను’.. నెటిజన్ క్షమాపణలకు అనసూయ రిప్లై ఏంటంటే?