టాలీవుడ్ టాప్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. తనదైన నటనతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఒక వైపు పలు షోల్లో యాంకర్ ఉంటూ.. మరోవైపు సినిమాలతో ఫుల్ బిజిగా ఉంది. షోలతో ఫుల్ బిజిగా ఉండే అనూ.. సోషల్ మీడియాలో సైతం యాక్టీవ్ గా ఉంటుంది. అలానే తనపై కామెంట్స్ చేసేవారికి తనదైన శైలిలో అదిరిపోయే కౌంటర్లు ఇస్తుంది. ఇటీవల కొన్ని రోజుల నుంచి ఓ యంగ్ హీరో ఫ్యాన్స్ కి అనుసూయకి మధ్య ట్వీట్టర్ వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో అనుసూయను 'ఆంటీ' అంటూ కొందరు తెగ ట్రోల్స్ చేశారు. దీంతో ఆగ్రహించిన అనూ.. తనను ఆంటీ అంటే కేసు పెడతానంటూ హెచ్చరించింది. అయితే ఈ విషయంలో ఆంటీ అని పిలిచినందుకు ఓ అభిమాని అనుసూయకు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్అవుతోంది. అనసూయ భరద్వాజ్ అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాందించుకుంది. అనసూయ సినిమాలతో బిజిగా ఉంటున్న సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానలతో షేర్ చేసుకుంటుంది. తనపై ఎవరైన అనవసరపు కామెంట్స్ చేస్తే.. వెంటనే కౌంటర్ ఇస్తుంది. కొన్ని రోజులుగా ఓ యంగ్ హీరో ఫ్యాన్స్ కి అనసూయకు మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఇటీవల ఆ యంగ్ హీరో సినిమా విడుదలైంది. ఆ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. ఈక్రమంలో ' అమ్మను అంటే ఆ ఉసురు ఊరికే పోదు..' అంటూ అనసూయ పరోక్షంగా ట్వీట్ చేసింది. దీంతో సదరు హీరో అభిమానులు రెచ్చిపోయారు. మా హీరోనే అంటావా అంటూ అనసూయపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను 'ఆంటీ' ట్రోల్ చేశారు. బూతు పదజాలంతోనూ విరుచుకుపడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎంతలా అంటే 'ఆంటీ (#Aunty) అనే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు. 'ఆంటీ' అంటూ కొందరు అలా ట్రోల్ చేయడంతో అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను ఆంటీ అంటే.. కేసు పెడతానంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినా కొంతమంది మళ్లీ అలానే ట్రోల్ చేశారు. అయితే తనను విమర్శించిన వారికి అంతే గట్టిగా సమాధానం ఇస్తోంది అనసూయ. ఈక్రమంలో నేడు కింగ్ నాగార్జున జన్మదినం సందర్భంగా విషెస్ చెబుతూ అనసూయా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కి ఓ అభిమాని రిప్లై ఇచ్చాడు. 'ఆంటీ అన్నందుకు సారీ అను..' అంటూ క్షమాపణలు అడిగాడు. అర్ధం చేసుకున్నందుకు థ్యాంక్ యూ అంటూ అనసూయ రిప్లై ఇచ్చింది. మరో అభిమాని కూడా హాలో మేడం సారీ అంటూ కామెంట్ చేశాడు. మరి.. అనసూయ విషయంలో తాజా పరిణామంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Ardham cheskunnanduku Thank you Rajashekar garu — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 29, 2022 ఇదీ చదవండి: రమ్యకృష్ణతో విభేదాలపై ఓపెన్ కామెంట్స్ చేసిన కృష్ణవంశీ! ఇదీ చదవండి: వీడియో: పబ్లిక్ లో బిగ్ బాస్ జంట ముద్దులాట! ఆపై అమ్మ చూస్తుందంటూ..