తెలుగు సినీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్లలో దక్ష నగర్కర్ ఒకరు. నాగచైతన్యతో ‘బంగార్రాజు’ సినిమాలో ఆడిపాడిన ఈ భామ.. ఆయనపై తనకు ఉన్న ఫీలింగ్స్‌ను బయటపెట్టారు. ఇంతకీ దక్ష ఏమన్నారంటే..!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో దక్ష నగర్కర్ ఒకరు. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ‘హోరాహోరీ’, ‘హుషారు’ లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ రెండు చిత్రాలతో రాని గుర్తింపు ఒక పెద్ద మూవీతో వచ్చింది. అదే ‘బంగార్రాజు’. ఇందులో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది దక్ష. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగచైతన్య-దక్ష మధ్య జరిగిన ఒక క్యూట్ మూమెంట్‌కు సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. చైతూ-దక్ష సైగలతో మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని అప్పట్లో వార్తలు పుట్టుకొచ్చాయి. వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ రూమర్స్ జోరుగా వినిపించాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన దక్ష.. నాగ చైతన్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చైతూ చాలా స్వీట్ పర్సన్ అని అన్నారు. ‘చై లాంటి అబ్బాయిని ప్రతి అమ్మాయి కూడా కోరుకుంటుంది. అమ్మాయిలందరి క్రష్ ఆయనే అని చెప్పొచ్చు. చాలా కేరింగ్ తీసుకుంటారు. అమ్మాయిలను ఎంతగానో గౌరవిస్తారు. ‘బంగార్రాజు’ మూవీ షూటింగ్ సమయంలో నన్ను కౌగిలించుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి చై చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత నాకు క్షమాపణలు చెప్పారు. అంత స్వీట్ అబ్బాయి ఆయన’ అంటూ చైతూపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు దక్ష. ఈ బ్యూటీ మాస్ మహారాజా రవితేజ సరసన ‘రావణాసుర’ చిత్రంలో నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
Naga chaitanya and daksha cute moment😌😜@chay_akkineni @DakshaOfficial #Bangarraju #ThankYouTheMovie #LOOKS 😍 pic.twitter.com/ejxSsqsjVA
— Fanboy 🐾 (@FanboyPraneeth) January 31, 2022