పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్తో ఎప్పుడైతే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారో అప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్ నీల్ అయితే ప్రశాంతంగా తడి గుడ్డ వేసుకుని పడుకోవచ్చునని డార్లింగ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి చాలా రోజుల వరకూ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్ బాబూ ప్రశాంత్ నీల్ ఏదో ఒక అప్డేట్ మా మొఖాన పడేయవయ్య అని ఫ్యాన్స్ తెగ రిక్వస్ట్లు పెడుతూ వచ్చారు. మొత్తానికి ప్రశాంత్ నీల్ కరుణించి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ నటిస్తున్న సలార్ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇంకో రెండు రోజుల్లో రానుందని ట్విట్టర్ వేదికగా సలార్ టీమ్ వెల్లడించింది. గెట్ రెడీ ఫర్ సలార్ అంటూ ట్వీట్ చేసింది.
దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఆగస్ట్ 15న మధ్యాహ్నం 12.58 గంటలకి ఉంటుందని సలార్ చిత్ర యూనిట్ ఒక ఫోటోను షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఓ రేంజ్లో సంబరాలు చేసుకుంటున్నారు. సలార్ అప్డేట్ కోసం వెయిటింగ్ అంటూ రీట్వీట్లతో మోతమోగిస్తున్నారు. కేజీఎఫ్ లాంటి భారీ చిత్రాలను నిర్మించిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్తో మరో భారీ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ దెబ్బతో ఇండియన్ సినిమా ఎక్కడికో వెళ్ళిపోవడం ఖాయమని అంటున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2023లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఆగస్ట్ 15న రానున్న సలార్ క్రేజీ అప్డేట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
𝐆𝐞𝐭 𝐫𝐞𝐚𝐝𝐲 𝐟𝐨𝐫 #𝐒𝐚𝐥𝐚𝐚𝐫. 𝐒𝐭𝐚𝐲 𝐓𝐮𝐧𝐞𝐝.#Prabhas @prashanth_neel @VKiragandur @hombalefilms @shrutihaasan @IamJagguBhai @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @SalaarTheSaga pic.twitter.com/tMXddHjPJj
— Salaar (@SalaarTheSaga) August 13, 2022