దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతూ ఉంది. రోజురోజుకి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ప్రజల్లో ఆందోళన రేపుతోంది. ఇక ఈసారి సెలబ్రెటీలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యాన్స్ కి ఓ బ్యాడ్ న్యూస్ బయటకి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, వారి తనయుడు అకీరా నందన్ లకు కరోనా సోకింది. రేణు దేశాయ్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం విశేషం. అయితే వారు గత కొన్ని రోజులు కితమే పాజిటివ్ కాగా ఇప్పుడు తాము కోలుకుంటున్నారు రేణు తెలిపారు. ఇద్దరు పరిస్థితి బాగానే ఉన్నట్టు తెలుస్తోంది.
ఇది చదవండి : ఒంటరిగా ఉండటం కష్టం.. నన్ను ఎంటర్టైన్ చేయండి
” నేను ఆల్రెడీ రెండు డోసులు వాక్సిన్ చేయించుకున్నాను. అయినా.. పాజిటివ్ వచ్చింది. అకిరా కి వాక్సిన్ చేయిద్దాం అనుకునే లోపు అతడికి కరోనా సోకింది” అని రేణు దేశాయ్ పోస్ట్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నట వారసుడిగా అకీరా పై ఫ్యాన్స్ చాలానే నమ్మకాలు పెట్టుకుని ఉన్నాడు. అకీరా కటౌట్ కూడా అదే రేంజ్ లో ఉండటంతో అతనిపై అంచనాలు పెరిగిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేణుదేశాయ్, అకీరా త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి.. ఈసారి కరోనా ఇలా సెలబ్రెటీలను టార్గెట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.