తన కాలికి తీవ్ర గాయమైందని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు నటి, దర్శకురాలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీలో నటిస్తున్నారామె.
సినిమా పరిశ్రమలో గతకొద్ది రోజులుగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. షూటింగ్స్, రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖులు గాయపడడం, మరి కొందరు మరణించడం జరిగింది. పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగులో ప్రమాదానికి గురయ్యారు. ప్రముఖ కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ రిలేటివ్, యువ కన్నడ నటుడు సూరజ్ కుమార్ రోడ్డు ప్రమాదానికి గురవడంతో కుడి కాలు నుజ్జు నుజ్జయింది. దీంతో మోకాలి వరకు కాలిని తొలగించారు. రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు రేణు దేశాయ్ గాయాల పాలయ్యారనే వార్త వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారామె. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నా కానీ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేక్షకాభిమానులకు టచ్‌లో ఉంటుంటారు రేణు. పిల్లలు అకీరా, ఆద్యలకు పిక్స్, వీడియోస్, తన పర్సనల్, ప్రొఫెషనల్ అప్‌డేట్స్ అన్నీ షేర్ చేస్తుంటారు.
ఇటీవల అకీరా వర్కౌట్స్ చేస్తున్న వీడియో పోస్ట్ చేయగా వైరల్ అయింది. లిటిల్ పవర్ స్టార్ రెడీ అవుతున్నాడంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో హీరోగా తెరంగేట్రం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. కాగా రేణు దేశాయ్ కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీతో నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో రవితేజ సోదరిగా కనిపించనున్నారని సమాచారం. కాస్ట్యూమ్ డిజైనర్, ఎడిటర్, యాక్ట్రెస్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్‌గా టాలెంట్ ప్రూవ్ చేసుకున్న రేణు దేశాయ్ రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి ఆ తరుణం రానే వచ్చింది. ఇదిలా ఉంటే రేణు షేర్ చేసిన వీడియో చూసిన ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.
రెండు రోజుల క్రితం తన కాలికి తీవ్ర గాయమైందని, దాంతో కాలి మూడు వేళ్లు బాగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా ఒక ఫింగర్ చితికిపోయిందని చెప్తూ ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేశారు. అంతే కాదు, కాలికి గాయమైనా లెక్క చెయ్యకుండా ఎంచక్కా బీచ్‌లో విహరిస్తూ.. ప్రకృతికి ఆస్వాదిస్తున్నారామె. అయితే తన కాలికి గాయం ఎలా అయ్యిందనే విషయం మాత్రం చెప్పలేదు. దీంతో ‘మీరు త్వరగా కోలుకోవాలి.. నటిగా బిజీ కావాలి’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధ పడుతూ వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారాహి టూర్ రెండు రోజుల పాటు వాయిదా పడింది.