మహా శివరాత్రి వేడుకలు దేశవ్యాప్తంగా ఆరంభమయ్యాయి. అభిషేక ప్రియుడైన శివుడ్ని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివలింగంపై కాసిన్ని నీళ్లు పోస్తూ శివనామాన్ని జపిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పరమేశ్వరుడ్ని దర్శించుకునేందుకు శివాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. దీంతో దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో నిండిపోయాయి. శంభో శంకర హర హర మహాదేవ్ అంటూ శివనామస్మరణతో త్రినేత్రుడి భక్తులు పరవశించిపోతున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఉపవాస దీక్షలు మొదలుపెట్టారు. సాధారణ భక్తులతో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా శివరాత్రి వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రేక్షకులకు, అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కూడా మహా శివరాత్రిని వైభవంగా జరుపుకుంటున్నారు. పండుగ నేపథ్యంలో ఇవాళ శ్రీశైలం వెళ్లారు ఆమె. పెద్ద కుమార్తె సుష్మితతో సహా శ్రీశైలానికి వెళ్లారు సురేఖ. అక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సుష్మిత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక, చిరు దంపతుల పెద్ద కుమార్తె సుష్మిత కాస్టూమ్ డిజైనర్ అనే విషయం తెలిసిందే. మెగాస్టార్ సినిమాల్లో ఆయన కాస్టూమ్స్, స్టైలింగ్ విషయాలను సుస్మితే చూసుకుంటున్నారు. మరి.. శివరాత్రి పర్వదినాన్ని మీరెలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.