మెగాస్టార్ చిరంజీవి ఈసారి ఎందుకో గట్టి నమ్మకంతో కనిపిస్తున్నారు. మాస్ సినిమా కావడం, అందులో రవితేజ కూడా యాక్ట్ చేయడం, సాంగ్స్ అన్నీ స్లో పాయిజన్ లా ఫ్యాన్స్ ఎక్కేస్తుండటంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సంక్రాంతికి అదిరిపోయే హిట్ కొట్టడం గ్యారంటీ అని ఫిక్సయిపోయినట్లున్నారు. అందులో భాగంగానే టీమ్ మొత్తంతో కలిసి అప్పుడే సెలబ్రేషన్స్ కూడా చేసేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి ఫుల్ మాస్ అవతార్ లో నటించిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఇప్పటికే ‘బాస్ పార్టీ’, ‘పూనకాలు లోడింగ్’ సాంగ్స్.. యూట్యూబ్ లో దుమ్మరేపుతున్నాయి. మరోవైపు సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతోంది. ఈ టైంలోనే న్యూయర్ వచ్చేసింది. దీంతో చిత్రబృందం మొత్తాన్ని తన ఇంటికి చిరు పిలిచారు. గ్రాండ్ లెవల్లో పార్టీ చేసుకున్నారు. ఆ వీడియోని చిరు ట్వీట్ చేయగా.. రవితేజ, డైరెక్టర్ బాబీ కూడా అన్నయ్యతో సాయంత్రం చాలా హ్యాపీగా గడిచిందని చెబుతూ ట్వీట్స్ పెట్టారు.
ఇకపోతే ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో చిరు అండర్ కవర్ పోలీస్ గా నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా శ్రుతిహాసన్ చేస్తోంది. సంక్రాంతికి చిరు.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తన సినిమాను తీసుకొస్తున్నారు. మరోవైపు బాలయ్య ‘వీరసింహారెడ్డి’.. చిరు సినిమా రావడానికి ఒకరోజు ముందే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలోనే థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అని తెలుస్తోంది. అదే టైంలో రెండూ కూడా మాస్ మూవీస్ కావడం మరో ప్లస్ పాయింట్స్. ఒకవేళ హిట్ అయితే గనుక బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు ఎక్కువగానే వస్తాయి. మరి చిరు ‘వాల్తేరు వీరయ్య’ ఎలా ఉండబోతుందని మీరనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని దిగువన కామెంట్స్ లో తెలియజేయండి.
It’s an awesome evening with my dearest Annayya @KChiruTweets, Mass Maharaja @RaviTeja_offl garu & my entire team of #WaltairVeerayya. 🤩🤩
2023 started on an auspicious note with our hardworking and Loveable team 🙌❤️#PoonakaaluLoading from jan 13th 😎@MythriOfficial pic.twitter.com/qUtfjeEE1K
— Bobby (@dirbobby) January 2, 2023