వాల్తేరు వీరయ్య సినిమా సాధించిన మాస్ విజయంతో.. ఈ ఏడాది ప్రారంభించారు చిరంజీవి. ఈ సినిమాలో ఊర మాస్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ముఠా మేస్త్రీ నాటి లుక్‌లో కనిపించి.. అభిమానుల కోరిక తీర్చారు. ఇక సినిమాలో చిరు కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అవి డిజైన్ చేసింది ఆయన కుమార్తె సుష్మిత. ఈ క్రమంలో కూతురికి మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక బహుమతి ఇచ్చారు చిరు. ఆ వివరాలు..
తండ్రికి కొడుకుల కన్నా కుమార్తెల మీద కాస్త అభిమానం ఎక్కువ అంటారు. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు తండ్రుల విషయంలో చాలా మందికి ఇదే వర్తిస్తుంది. కుమార్తెలను అధికంగా ప్రేమించే తండ్రుల జాబితాలో ముందు వరుసలో ఉంటారు మెగాస్టార్ చిరంజీవి. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. చెర్రీ కన్నా శ్రీజ, సుష్మితల మీదనే తనకు మమకారం కాస్త అధికం అని.. రామ్ చరణ్ ఈ విషయంలో అప్పుడప్పుడు అలుగుతాడని గతంలో చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి తన పెద్ద కుమార్తెకు అరుదైన, ఖరీదైన కానుక ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
ఈ ఏడాది సంక్రాతి సందర్భంగా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఫ్యాన్స్ చిరంజీవిని ఎలా చూడాలనుకున్నారో.. అదే లుక్‌లో కనిపించి అభిమానులను ఖుషీ చేశారు మెగాస్టార్. ఈ సినిమాలో ఆయన లుక్, కాస్ట్యూమ్ అన్ని కలిసి బాస్‌ని ఊర మాస్ గెటప్‌లో నిలిపాయి. ఇక చిరు మాస్ లుక్‌పై ప్రశంసలు కురిపించారు అభిమానులు. అయితే దీని వెనక ఆయన కుమార్తె సుష్మిత కష్టం దాగి ఉంది. వాల్తేరు సినిమాలో చిరుని పవర్‌ఫుల్ బాస్‌గా కనిపించేలా చేయడం కోసం సుష్మిత ఎంతో కష్టపడింది. తండ్రి కోసం తనే ప్రత్యేకంగా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. బాస్ కోసం సుష్మిత డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ సూపర్‌గా ఉన్నాయి. ఇటు మాస్.. అటు క్లాస్ లుక్‌లో అదరగొట్టాడు చిరు.
తన కోసం ఇంత మంచి కాస్ట్యూమ్ డిజైన్ చేసిన కుమార్తెకు చిరు ఖరీదైన బహుమతి ఇచ్చాడు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని.. కుమార్తె సుష్మితకు ప్రత్యేక బహుమతి ఇచ్చాడు. బంగారు, వెండి పూత కలగలిపి ఉన్న దుర్గా దేవి ప్రతిమను సుష్మితకు కానుకగా అందించాడు చిరు. ఈ సందర్భంగా తండ్రితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సుష్మిత. ‘‘నాకు ఇంత అపురూపమైన బహుమతి ఇచ్చినందకు థాంక్యూ నాన్న. మహిళను దుర్గాదేవి కన్నా శక్తివంతంగా ఇంకెవరు చూపగలరు. అత్యంత శక్తివంతురాలు అమ్మవారు’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలువుతున్నాయి. చిరు ఇచ్చిన కానుక అద్భుతంగా ఉంది అంటున్నారు అభిమానులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.