పిల్లలను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్న పిల్లల్ని అందరూ ప్రేమిస్తారు. వారితో ఆడుకుంటారు. అంతవరకు ఓకే.. కానీ ఓ నటి మాత్రం తన పిల్లలకు ఏకంగా లిప్ కిస్ పెట్టేసింది. అంతేగాక ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. దీంతో ఇది కాస్తా కాంట్రవర్సీగా మారింది.
చిన్న పిల్లలు ముద్దొస్తుంటారు. అందుకే ఎవ్వరైనా సరే పిల్లల్ని చూస్తే వెంటనే వారిని ఎత్తుకుంటారు, గారాబం చేస్తారు. సరదాగా వారితో కాసేపు ఆడుకుంటారు. దగ్గరగా తీసుకుని కబుర్లు చెబుతారు. వాళ్లు మాట్లాడుతుంటే చూస్తూ మురిసిపోతారు. ప్రపంచం గురించి తెలియని పసితనం, తమదైన లోకంలో బతికే పిల్లలను చూస్తూ ఎంతసేపైనా అలాగే ఉండిపోవచ్చు. వారితో కాసేపు గడిపినా అన్ని ఒత్తిళ్లు దూరం చేసుకోవచ్చు. అందుకే పెద్దలు ఎవ్వరైనా ఖాళీ సమయం దొరికితే పిల్లలతో ఆడుకుంటారు. వారిని దగ్గర తీసుకుని సరదాగా ముద్దులు పెడుతుంటారు. ఇందులో తప్పు లేదు. చిన్న పిల్లలకు ముద్దులు పెట్టొచ్చు. కానీ పిల్లలకు లిప్ కిస్ ఇవ్వడం ఎంత వరకు సబబు! మనకు తెలిసినంతలో అయితే ఎవరూ పిల్లలకు లిప్ కిస్‌లు ఇవ్వరు. కానీ ఓ బాలీవుడ్ స్టార్ నటి మాత్రం తన పిల్లలకు లిప్ కిస్ ఇచ్చింది. అంతేగాక ఆ ఫొటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది.
ఆ నటి ఎవరో కాదు ఛవి మిట్టల్. దీంతో ఆమెపై నెటిజన్స్ మండిపడుతున్నారు. పిల్లలకు లిప్ కిస్ ఇవ్వడం ఏంటి? బుద్ధి లేదా? అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు. వాళ్లకు ఇప్పటినుంచే ఏం నేర్పిస్తున్నారు అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. మరికొంత మంది మీ బ్యాక్టీరియాను పిల్లలకు పంచుతున్నారు, ఆరోగ్యపరంగా ఇది అస్సలు మంచిది కాదంటూ సీరియస్ అవుతున్నారు. సాధారణ నెటిజన్స్‌తో పాటు సెలబ్రిటీలు కూడా ఛవి మిట్టల్ చర్యను తప్పుబడుతుండటం గమనార్హం. ఒకవేళ పిల్లలకు లిప్ కిస్ ఇచ్చినా.. ఇలా అందరికీ తెలిసేలా పెట్టడం సరికాదంటూ కొందరు ప్రముఖులు ఆమెపై మండిపడుతున్నారు. అయినా ఛవి మిట్టల్ వెనక్కితగ్గకుండా మరిన్ని లిప్ కిస్ ఫోటోలను షేర్ చేసింది. పిల్లల మీద తనకు ఉన్న ప్రేమను చూపించేందుకు ఇదో పద్ధతి అని ఛవి తన చర్యను సమర్థించుకుంది. మరి.. ఈ కాంట్రవర్సీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.