బర్నింగ్‌స్టార్‌గా అభిమానం సొంతం చేసుకున్న నటుడు సంపూర్ణేష్‌బాబు. సినిమాల్లో కామెడీ హీరోగా కనిపించినా నిజ జీవితంలో మాత్రం నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు. ఇటీవల కరోనా సోకి కన్నుమూసిన ప్రముఖ జర్నలిస్టు, నటుడు టీఎన్‌ఆర్ కుటుంబానికి సాయం చేసి తన దాతృత్వం చాటుకున్నాడు. ఫ్రాంక్లీ విత్ టీఎన్‌ఆర్ అనే షోతో ఎంతో పాపులర్ అయిన టీఎన్‌ఆర్ ఎంతో గుర్తింపు పొందారు. పేరునే బ్రాండ్‌గా మార్చుకొని తనదైన స్టైల్‌లో ప్రశ్నలడిగేవారు టీఎన్‌ఆర్. అందుకే ఆయనతో ఇంటర్వ్యూలంటే ఎంతోమంది ప్రముఖులు ఆసక్తి కనబరిచేవారు. అప్పటిదాకా ఎవరికి తెలియని విషయాలను సైతం అతిధుల నుంచి రాబట్టేవారాయన.రామ్ గోపాల్ వర్మ, తేజ, తనికెళ్ల భరణి వంటి సినీ ప్రముఖులతో 4 గంటల పాటు సుధీర్గంగా ఇంటర్వ్యూ చేసిన ఘనత టీఎన్‌ఆర్‌దే. తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా అంత ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేయలేదు. అంతటి ప్రత్యేకతను సంపాదించుకున్నారయన.
టీఎన్‌ఆర్ సతీమణి బ్యాంకు ఖాతాలో తన వంతు సాయంగా రూ.50వేలు సంపూర్ణేష్‌బాబు జమచేశాడు. ఈ విషయాన్ని సంపూ ట్విటర్ వేదికగా ప్రకటించారు. టీఎన్‌ఆర్ ఇంటర్వ్యూల వల్ల తన కెరీర్‌తో పాటు వ్యక్తిగతంగానూ ఒక మెట్టి ఎదిగాను అని సంపూ అన్నారు. టీఎన్‌ఆర్ కుటుంబానికి ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తన వంతు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. గతంలోనూ హుద్‌హుద్ తుపాన్ వచ్చినప్పుడు సంపూ తన వంతుగా ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. టీఎన్‌ఆర్ సతీమణి బ్యాంకు ఖాతాలో తన వంతు సాయంగా రూ.50వేలు జమచేశాడు. ఈ విషయాన్ని సంపూ ట్విటర్ వేదికగా ప్రకటించారు.