బర్నింగ్‌స్టార్‌గా అభిమానం సొంతం చేసుకున్న నటుడు సంపూర్ణేష్‌బాబు. సినిమాల్లో కామెడీ హీరోగా కనిపించినా నిజ జీవితంలో మాత్రం నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు. ఇటీవల కరోనా సోకి కన్నుమూసిన ప్రముఖ జర్నలిస్టు, నటుడు టీఎన్‌ఆర్ కుటుంబానికి సాయం చేసి తన దాతృత్వం చాటుకున్నాడు. ఫ్రాంక్లీ విత్ టీఎన్‌ఆర్ అనే షోతో ఎంతో పాపులర్ అయిన టీఎన్‌ఆర్ ఎంతో గుర్తింపు పొందారు. పేరునే బ్రాండ్‌గా మార్చుకొని తనదైన స్టైల్‌లో ప్రశ్నలడిగేవారు టీఎన్‌ఆర్. అందుకే ఆయనతో ఇంటర్వ్యూలంటే ఎంతోమంది ప్రముఖులు ఆసక్తి […]