ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వాలు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన చేతి వృత్తులు చేసుకునేవారికి, కుల వృత్తులు చేసుకునేవారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇతర వర్గాల వారికి రూ. లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దరఖాస్తులను స్వీకరిస్తుంది.
ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా పలు సంక్షేమ పథకాల ద్వారా ఆయా వర్గాలకు ఆర్థిక సాయం అందజేస్తుంది. ఇప్పటికే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఇవ్వనుంది. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. మరోవైపు బీసీ వర్గానికి చెందిన చేతి వృత్తులు, కుల వృత్తుల వారికి నెల నెలా రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా మైనార్టీలకు కూడా రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇటీవల తెలంగాణ సర్కార్ మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీన దీనికి సంబంధించి జీవోను కూడా విడుదల చేసింది. అయితే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు నెల 14 వరకూ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతి వెస్లీ ఉత్తర్వులు జారీ చేశారు. విధి విధానాలు, అర్హతలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
తెలంగాణ స్టేట్ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టం (టీఎస్ఓబీఎంఎంఎస్) పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించారు. ఈ పథకానికి 21 నుంచి 55 ఏళ్ల వయసున్న మైనార్టీలే అర్హులని ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్ళు లక్షన్నర లోపు ఆదాయం కలిగి ఉండగా.. పట్టణ ప్రాంతానికి చెందిన వాళ్ళు రెండు లక్షల లోపు ఆదాయం కలిగి ఉండాలన్న నిబంధన పెట్టింది. ఈ పథకానికి సంబంధించి వివరాలు తీసుకోవడానికి జిల్లా మైనార్టీ అధికారిని లేదా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులను సంప్రదించవచ్చునని అధికారులు తెలిపారు. 040-23391067 నంబర్ కు కాల్ చేసి కూడా పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చునని వెల్లడించారు.