బాక్సాఫీస్ వద్ద ‘బ్రహ్మాస్త్ర‘ మూవీ కలెక్షన్స్ దూకుడు కొనసాగిస్తుంది. మొదటి రోజు మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. వసూళ్ల పరంగా అసలు తగ్గడం లేదు. నెగటివ్ రివ్యూస్, బాయ్ కాట్ ట్రోల్స్ ని పక్కనపెట్టి, బ్రహ్మాస్త్ర మూడు రోజుల్లో అద్భుతమైన కలెక్షన్స్ తో పాటు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. అయితే.. కంటెంట్ పరంగా వీక్ అని కామెంట్స్ పొందిన బ్రహ్మాస్త్రం.. తెలుగులో 2వ రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి.. మూడో రోజు ఏకంగా మూడు కోట్ల లాభాల్లో చేరింది.
రిలీజ్ ముందే పాటలు, ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమాలో స్టార్ యాక్టర్స్ షారుఖ్ ఖాన్, కింగ్ నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనిరాయ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ముఖ్యంగా బ్రహ్మాస్త్రం స్టోరీ లైన్ తో పాటు విఎఫ్ఎక్స్, సాంగ్స్, ప్రధాన తారాగణం నటన ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక బ్రహ్మాస్త్ర అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ.. ప్రధానంగా 3డి, ఐమ్యాక్స్ వెర్షన్స్ లో దూసుకుపోతుంది. ఇక మూడో రోజు బ్రహ్మాస్త్రకు ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ లభించింది. తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల్లో రూ. 16 కోట్ల గ్రాస్, రూ. 8.5 కోట్లు షేర్ రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాస్త్రం మొదటి రోజు 75 కోట్లు, రెండో రోజు 85 కోట్లు, మూడో రోజు 90 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్ లో ఫస్ట్ డే 3.4 మిలియన్ డాలర్స్, సెకండ్ డే 3.8 మిలియన్స్, మూడో రోజు 4.5 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. మొత్తంగా మూడు రోజుల్లో ఓవర్సీస్ లో బ్రహ్మాస్త్రం 11.7 మిలియన్ డాలర్లు వసూల్ చేయడం విశేషం. ఇదిలా ఉండగా.. మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా 128 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. 4వ రోజు 150 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమనే ట్రేడ్ వర్గాల అంచనా. ఇక మూడు రోజుల్లో బ్రహ్మాస్త్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 240 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.
బ్రహ్మాస్త్ర 3 రోజుల కలెక్షన్స్ చూసినట్లయితే..
హిందీ వెర్షన్:(నెట్)
ఇతర భాషల్లో:(గ్రాస్)
తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల్లో రూ. 16 కోట్ల (గ్రాస్), రూ. 8.5 కోట్లు (షేర్)
Brahmāstra has a FABULOUS weekend… *#Hindi* version… *#Nett* BOC…
Day 1: ₹ 31.5 cr+
Day 2: ₹ 37.5 cr+
Day 3: ₹ 39.5 cr+
Final total could be higher… #India biz.
National chains superb…
Day 1: ₹ 17.15 cr est
Day 2: ₹ 20.73 cr est
Day 3: ₹ 21.63 cr est pic.twitter.com/5HVxevmoDV— taran adarsh (@taran_adarsh) September 12, 2022