తెలుగు చిత్ర పరిశ్రమలో అఖండ చిత్రంలో మరో కొత్తశకం మొదలైన వాతావరణం కనిపిస్తుంది. మొన్నటివరకు ఎన్ని థియేటర్లలో ఎన్ని సినిమాలు రిలీజైనా రాని సందడి.. ఒక్కసారిగా అఖండ చిత్రంతో ఓ రేంజిలో షురూ అయింది. దాదాపు రెండు లాక్ డౌన్స్ అనంతరం విడుదలైన ఫస్ట్ బిగ్గెస్ట్ రిలీజ్ అఖండ. ప్రస్తుతం అఖండమైన విజయోత్సాహంతో ఈ చిత్రం దూసుకెళ్తుంది. మాస్ కాంబో నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను హ్యాట్రిక్ సినిమాగా అఖండ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం మాసివ్ హిట్ అందుకోవడంతో చిత్రంలోని నటీనటుల గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
ముఖ్యంగా ఈ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త విలన్ దొరికాడని చెప్పవచ్చు. మాస్ డైరెక్టర్ బోయపాటి – క్లాస్ యాక్టర్ శ్రీకాంత్ ను వరదరాజులు అనే భీకరమైన విలన్ క్యారెక్టర్ తో పరిచయం చేసాడు. ఈ చిత్రంతో శ్రీకాంత్ విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనట్లే అనుకోవచ్చు. అయితే ఇదివరకు ఇండస్ట్రీ కొత్త విలన్ కోసం ఎదురుచూస్తున్న టైములో డైరెక్టర్ బోయపాటి క్లాస్ యాక్టర్ జగపతి బాబును డేంజరస్ విలన్ గా ఇంట్రడ్యూస్ చేసాడు. ఆ తర్వాత జగ్గూభాయ్ సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారాడు. మరి ఇప్పుడు అఖండ చిత్రంతో యాక్టర్ శ్రీకాంత్ విలన్ గా అడుగుపెట్టాడు.
శ్రీకాంత్ విషయంలో కూడా బాలయ్య – బోయపాటి కాంబోనే కావడం విశేషం. మరి జగ్గూభాయ్ లా శ్రీకాంత్ తన కెరీర్ ను జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటాడా? తనను విలన్ గా మరోస్థాయికి తీసుకెళ్లే క్యారెక్టర్స్ ఎంపిక చేసుకొని బిజీ అవుతాడేమో చూడాలి. ప్రస్తుతం జగపతి బాబు అటు విలన్ గాను ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెప్పిస్తున్నాడు. మరి అలా శ్రీకాంత్ కూడా అన్ని పాత్రలు చేస్తాడా? కేవలం విలన్ వేషాలే వేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. శ్రీకాంత్ విలన్ క్యారెక్టర్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.