నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అఖండ’ చిత్రం హవా ఇంకా కొనసాగుతోంది. మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం.. డిసెంబర్ 2న విడుదలై అంచనాలకు మించి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా.. వీరి కెరీర్ లోనే ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది అఖండ.
కేవలం తెలుగు భాషలో తెరకెక్కిన అఖండ చిత్రానికి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం విశేషం. అయితే.. ఈ చిత్రానికి సంబంధించి ఓవైపు హిందీ డబ్బింగ్ రిలీజ్ చేయాలని డిమాండ్స్ వినిపిస్తుండగా.. మరోవైపు అఖండ బాలీవుడ్ రీమేక్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అఖండ సినిమాని హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేసినా బాలీవుడ్ లో బాలయ్య క్రేజ్ దృష్ట్యా మేకర్స్ మానుకున్నారని టాక్ నడుస్తుంది.
ఈ విషయాన్ని గ్రహించిన బాలీవుడ్ స్టార్ హీరోలు అఖండ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ముందుకు వచ్చారట. ప్రస్తుతం అఖండ రీమేక్ హక్కుల కోసం స్టార్ హీరోలు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ పోటీ పడుతున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. అక్షయ్, అజయ్ ఇద్దరూ సూపర్ క్రేజ్ ఉన్న హీరోలే. కాబట్టి అఖండ సినిమా వీరిలో ఎవరు చేసినా ఓకే అంటున్నారట బాలీవుడ్ ఫ్యాన్స్. చూడాలి మరి అఖండ రీమేక్ రైట్స్ ఎవరు దక్కించుకుంటారో! మరి బాలయ్య అఖండ సినిమా హవా పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.