Bollywood: సినిమా హీరోయిన్లు సీజన్ లాంటోళ్ళు. ఏడాదికి ఒకటో, రెండో సినిమాలతో దర్శనమిస్తుంటారు. కానీ సీరియల్స్ లో నటించే వాళ్ళు అలా కాదు, డైలీ ప్రతీ ఒక్కరి టీవీల్లో సందడి చేస్తుంటారు. సినిమా హీరోయిన్లకే కాదు, టీవీ సీరియల్స్ లో నటించే వారికి కూడా విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. ఆ పాపులారిటీని మరింత పెంచుకునేందుకు.. సీరియల్స్ లో నటించే హీరోయిన్స్ కూడా సోషల్ మీడియాలో అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. డైలీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ కనువిందు చేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ సీరియల్ యాక్ట్రెస్ దిశా పర్మార్.. భర్త రాహుల్ వైద్యపై ముద్దుల వర్షం కురిపించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ వివాహం జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా.. మొదటి వివాహ వేడుకను లండన్ లో జరుపుకున్నారు. ప్రస్తుతం లండన్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ జంట.. ఫ్లైట్ లో రొమాంటిక్ మూడ్ లోకి వెళ్ళిపోయారు. ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకుంటూ.. రొమాంటిక్ గా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.
ఇక ఆమె భర్త రాహుల్ వైద్య, ఈ ముద్దుల ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ తన భార్య గురించి అద్భుతంగా రాశారు. “హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ మై లవ్, మొదటి సంవత్సరం చాలా త్వరగా వెళ్ళిపోయింది. నీలాంటి జీవిత భాగస్వామి దొరకడం నా అదృష్టం. ఈ జన్మకే కాదు, మరో ఏడు జన్మలకూ నువ్వే నా జీవిత భాగస్వామి కావాలి. నీ అంతర సౌందర్యం నన్ను ప్రతిరోజూ మెరిసేలా చేస్తుంది. ఐ లవ్యూ వైఫే” అంటూ రాసుకొచ్చారు.
బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె గత ఏడాది సింగర్ రాహుల్ వైద్యని వివాహం చేసుకుంది. వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట.. ఆనంద క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Nithya Menon: మలయాళ నటుడితో పెళ్లికి ఓకే చెప్పిన నిత్య మేనన్?
ఇది కూడా చదవండి: Mani Ratnam: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం