మలయాళ ముద్దుగుమ్మ నిత్య మేనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ భామ తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ హోదా అందుకుంది. ఇటీవల భీమ్లానాయక్ సినిమా, తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇన్నాళ్లుగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నా కూడా ఎప్పుడూ ఒక్క పుకారు కూడా ఈమెపై రాలేదు. కానీ, ప్రస్తుతం ఏకంగా ఆమె పెళ్లి విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు కోలీవుడ్ సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అది కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితోనే వివాహం అంటూ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) నిత్య మేనన్ ఇండస్ట్రీలోకి రాకముందే ఆ హీరోతో పరిచయం ఉన్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత వారి పరిచయం కాస్తా ప్రేమగా మారిందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే వీళ్లిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారంటూ చెవులు కొరుక్కుంటున్నారు. అయితే మలయాళ నటుడితో నిత్య మేనన్ వివాహమనే వార్తలో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) ఇంక సినిమాల విషయానికి వస్తే.. నిత్య మేనన్ ఇటీవలే ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. మలయాళంలో 19(1)(a), ఆరాం తిరుకల్పన అనే చిత్రాల్లో నటించింది. అవి షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తమిళ్ లో తిరుచిత్రంబలం అనే చిత్రంలో నటించింది. ఆ మూవీ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మలయాళ నటుడితో నిత్య మేనన్ పెళ్లి అనే వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) ఇదీ చదవండి: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఇదీ చదవండి: ఆస్కార్ బరిలో RRR.. ఈ సారి అవార్డు ఖాయం అంటున్న సినీ విశ్లేషకులు..