సినీ ఇండస్ట్రీలో స్టార్ అనిపించుకుంటున్న హీరోలంతా ఒకప్పుడు.. అంటే కెరీర్ ప్రారంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నవారే. విమర్శించిన వారంతా బాగానే ఉంటారు. కానీ వారు చేసిన విమర్శలకు సరైన సమాధానం ఇవ్వడం అనేది ప్రతి నటుడికి సవాల్ లాంటిదే. హీరోగా ఓ సినిమా.. ఓ క్యారెక్టర్ చేసినప్పుడు నటుడిపై కామెంట్స్ రావడానికి పెర్ఫార్మన్స్ ప్రధాన కారణంగా చెబుతుంటారు. ఆ తర్వాతే వారు ఎంచుకున్న క్యారెక్టర్స్ ముడిపెడుతుంటారు విమర్శకులు.
అలాంటి ఘోరమైన విమర్శలకు సమాధానం వారి యాక్టింగ్ పెర్ఫార్మన్స్ తోనే చెప్పాలని భావిస్తుంటారు యాక్టర్స్. తాజాగా మెగాహీరో రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా పోలీస్ రోల్ ప్లే చేశాడు. అయితే.. చరణ్ నటనకు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి విమర్శకుల వరకు అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. కానీ రామ్ చరణ్ పై ఒకప్పుడు బాలీవుడ్ క్రిటిక్స్ చేసిన విమర్శలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.2013లో జంజీర్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు చరణ్. ఆ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ పోషించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచగా.. రామ్ చరణ్ పై బాలీవుడ్ క్రిటిక్స్ ఘోరమైన విమర్శలు చేశారు. పోలీస్ క్యారెక్టర్ కి సూట్ అవ్వని ఫేస్ అంటూ ట్వీట్స్ కూడా పెట్టారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా చూసి.. ఒకప్పుడు ఘోరంగా విమర్శించినవారే.. ఇప్పుడు చరణ్ నటనకు ఫిదా అయిపోయి “చరణ్ దేశం మొత్తాన్ని తన పెర్ఫార్మన్స్ తో షేక్ చేశాడు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఎవరైతే తన నటన పై విమర్శలు గుప్పించారో.. వారితోనే ఇప్పుడు శభాష్ అనిపించుకోవడం అనేది మాములు విషయం కాదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ నిజంగానే వీరంగం సృష్టించాడు. అగ్నిపర్వతం లాంటి ఆశయాన్ని గుండెల్లో అణిచిపెట్టి పైకి విరుద్ధమైన భావోద్వేగాలను పలికించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ పై క్రిటిక్స్ చేసిన ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ లో చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రధానపాత్ర పోషించాడు. మరి చరణ్ పై వచ్చిన విమర్శలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
. @AlwaysRamCharan has taken the entire nation by storm with his performance in RRR 🔥🔥 #RRRamCharan #RRReview pic.twitter.com/8fV7iK3bCY
— Haricharan Pudipeddi (@pudiharicharan) March 25, 2022