సినీ పరిశ్రమలో వారసత్వాలు కొత్త కాదు. కొంత మంది స్టార్ హీరో, హీరోయిన్ల పిల్లలు సినిమాలకు పరిచయమైతే.. మరికొంత మంది హీరో, హీరోయిన్ల సోదరీ, సోదరులు వస్తుంటారు. అయితే కొంత మంది స్టార్ నటీనటుల పిల్లలు, సోదరులు, సోదరులు.. భిన్నమైన రంగాలను ఎన్నుకుంటారు. అటువంటి వారిలో ఒకరూ ఈ నటి సోదరి.
బాలీవుడ్ టూ మాలీవుడ్లో అనేక మంది నటీనటులు ఉన్నారు. వారిలో కొంత మందికి మాత్రమే ఫేమ్ ఉంటుంది. స్టార్ హోదాను సంపాదిస్తారు. మిగిలిన నటీనటులతో పోలిస్తే, ఈ స్టార్ ఫ్యామిలీ గురించి తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తారు. హీరో, హీరోయిన్ల తల్లిదండ్రుల నుండి వారికి పుట్టే పిల్లల వరకు ప్రతీది తెలుసుకోవాలన్న ఆత్రుత కనబరుస్తుంటారు. అయితే కొంత మంది వారసులు తెరకే పరిచయమౌతుందే.. మరికొంత మంది నటీనటుల సోదరీ సోదరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పరిశ్రమలోకి అడుగుపెడతారు. వారిలో కొందరు మాత్రమే విజయాన్ని రుచిచూస్తుంటారు. మరి కొంత మంది భిన్నమైన కెరీర్ను ఎన్నుకుంటారు. అటువంటి వారిలో ఒకరూ ఈ స్టార్ హీరోయిన్ సోదరి.
నటి దిశా పటానీ బాలీవుడ్ సినిమాలతో దూసుకెళుతున్నారు. గత ఏడాది ఏక్ విలన్ రిటర్స్ తో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆమె బాలీవుడ్ మోస్ట్ బిజీ హీరోయిన్గా మారిపోయారు. ఆమె సినీ కెరీర్ తెలుగు సినిమాతోనే ప్రారంభం కావడం విశేషం. వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాతోనే ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా ఆశించిన ఫలితం లేనప్పటికీ.. దిశాకు బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినిమా ధోనీ విజయంతో ఆమె వెను దిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకుండా పోయింది. భాఘీ 2తో తనను తాను నిరూపించికున్నబ్యూటీ భారత్, మలంగ్, రాథే వంటి సినిమాల్లో నటించింది. గత ఏడాది విడుదలైన ఏక్ విలన్ రిటర్న్స్ తో మెప్పించింది.
బాలీవుడ్ హీరో జాకీష్రాఫ్ కుమారుడు, యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ తో చెట్టాపట్టాలేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే దిశా.. పలు వీడియోలు పంచుకుంటుందీ. హాట్ ఫోటో షూట్ లతో పాటు వర్క్ అవుట్ సంబంధించిన వీడియోలు పోస్టు చేస్తూ ఉంటోంది. సౌందర్య ఉత్పత్తి సాధనాలతో పాటు లోయర్ ఫిట్ నెస్ కాస్ట్యూమ్ని దిశా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఫిట్ నెస్ కారణంగా యాక్షన్ సన్నివేశాలను కూడా ఆమె ఈజీగా చేసేస్తుంది. మీకు తెలియని ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దిశా పటానీ ఇంత ఈజీగా యాక్షన్ సన్నివేశాల్లో నటించడానికి కారణం ఆమె కుటుంబమే.
దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ ఓ పోలీస్ ఆఫీసర్, ఆమె తల్లి హెల్త్ ఇన్ స్పెక్టర్. దిశాకు ఓ సోదరి కూడా ఉంది. ఆమె పేరు ఖుష్బూ పటానీ. దిశా ఎంచుకున్న గ్లామర్ ఫీల్డ్ కాకుండా ఆమె విభిన్న రంగంలోకి వెళ్లింది. ఆమె భారత ఆర్మీలో విధులు నిర్వహిస్తుంది. ఇండియన్ ఆర్మీలో ఖుష్బూ పటానీ లెఫ్ట్ నెంట్ హోదాలో ఉన్నారు. ఆమె కూడా మంచి ఫిట్ నెస్ ఫ్రీక్. దిశా ఆమె సోదరి నుండి ఫిట్ నెస్ నేర్చుకుంది. ఇక గ్లామర్ విషయంలో దిశాపటానితో పోటీ పడుతూ ఉంటుంది. చాలా విషయాలలో ఇద్దరి మధ్య దగ్గర పోలికలు ఉంటాయి. వేరు వేరు రంగాల్లో ఉన్నప్పటికీ ఆయా రంగాల్లో దూసుకెళుతున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. ప్రస్తుతం దిశా తెలుగులో మరోసారి నటించబోతోంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రం ప్రాజెక్టు కెలో ఆమె కూడా నటిస్తున్నారు. అలాగే సూర్య 42వ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా ఖరారైనట్లు వినికిడి. మరో హిందీ సినిమా యోధ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దిశా పటానీ సినిమాల్లో మీకు ఏదీ ఇష్టమో కామెంట్లో తెలియజేయండి.