సినీ పరిశ్రమలో వారసత్వాలు కొత్త కాదు. కొంత మంది స్టార్ హీరో, హీరోయిన్ల పిల్లలు సినిమాలకు పరిచయమైతే.. మరికొంత మంది హీరో, హీరోయిన్ల సోదరీ, సోదరులు వస్తుంటారు. అయితే కొంత మంది స్టార్ నటీనటుల పిల్లలు, సోదరులు, సోదరులు.. భిన్నమైన రంగాలను ఎన్నుకుంటారు. అటువంటి వారిలో ఒకరూ ఈ నటి సోదరి.
ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ అందాల భామ దిశా పటానీ చేసింది తక్కువ సినిమాలే అయినా తన అంద చందాలతో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న దిశా పటానీ, తెలుగులో లోఫర్ సినిమాలో నటించింది. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా ప్రేమాయనం సాగిస్తోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో కలిసి భాగీ-2, భాగీ-3 సినిమాలు వచ్చాయి. టైగర్ ష్రాఫ్, దిశా పటానీలు నిజంగానే ప్రేమలో ఉన్నారా, […]