ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ అందాల భామ దిశా పటానీ చేసింది తక్కువ సినిమాలే అయినా తన అంద చందాలతో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న దిశా పటానీ, తెలుగులో లోఫర్ సినిమాలో నటించింది. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా ప్రేమాయనం సాగిస్తోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో కలిసి భాగీ-2, భాగీ-3 సినిమాలు వచ్చాయి.
టైగర్ ష్రాఫ్, దిశా పటానీలు నిజంగానే ప్రేమలో ఉన్నారా, లేక కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనా అన్నది మాత్రం తెలియడం లేదు. ప్రముఖ గార్మెంట్ సంస్థ కాల్విన్ క్లైన్ కి దిశా పటానీ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తోంది. ఆ దుస్తులు ధరించి హాట్ ఫోటోలను అప్పుడప్పుడూ సోషల్ మీడియా ద్వారా అభిమానుతో పంచుకుంటుంది ఈ బాలీవుడ్ భామ.
ఇక ఇప్పుడు మరో హాట్ ఫోటోని షేర్ చేసింది దిశా పటానీ. జిమ్‌లో వర్కవుట్ చేసిన తర్వాత తన ముఖం కనిపించకుండా, స్పోర్ట్స్ బ్రాలో కేవలం నడుము మాత్రమే కనిపించేలా, అది కూడా బాత్రూంలో అద్దం ముందు ఓ సెల్ఫీ దిగింది దిశా. అదిగో ఆ ఫోటోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇంకేముంది బాత్ రూమ్ సెల్ఫీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దిశా పటానీ అభిమానులు ఈ ఫొటో కు ఫిదా అయిపోతున్నారు. అమ్మడి అందం రోజు రోజుకు పెరిగిపోతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.