ఇంటర్నెట్, సోషల్ మీడియా చలవ వల్ల సెలబ్రిటీలు ఫోటోలు చిటికెలో దొరికేస్తున్నాయి. పార్టీ వైబ్స్ అని, థ్రో బాక్ పిక్స్, ఫన్నీ మూవ్స్ అంటూ తమ ఫోటోలను సెలబ్రిటీలే తమ సోషల్ మీడియా వాల్స్ లో పోస్టులు చేస్తున్నారు. దీంతో అవి నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇప్పటి ఫోటోలే కావడం విశేషం. కానీ చిన్నప్పటి ఫోటోలు దొరకడం చాలా అరుదు. వారు కూడా అలాంటి ఫోటోలను ఎక్కువగా పోస్టు చేయరు. అటువంటిదే ఈ ఫోటో. ఈ ఫోటోలో బుగ్గలతో, పెద్ద కళ్లతో తదేకంగా చూస్తున్నాడు కదా ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా.. ఒక్కసారి తీక్షణంగా చూడండి. గుర్తుకువచ్చాడా..రాలేదా..? అయితే చెప్పేస్తాలేండి.
ఆ నటుడు మరేవరో కాదూ.. బాబీ సింహా. ఇటీవల సంక్రాంతికి విడుదలయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యలో సాల్మన్ సీజర్ గా నటించాడు కదా.. అతడే ..ఇతడు. బాబీ సింహ తమిళ నటుడు అని అనుకుంటారు కానీ.. వాస్తవానికి అతడు తెలుగు వ్యక్తి. ఆయన హైదరాబాదీలో జన్మించినప్పటికీ.. ఆయన మూలాలన్నీ ఆంధ్రాలో ఉన్నాయి. వారి అమ్మనాన్నలదీ కృష్ణా జిల్లాలోని మోపీదేవిలోని కోసూరి వారిపాలెం. ఆయన విద్యాభ్యాసం అంతా మోపీదేవీలోనే జరిగింది. 1995లో వీరి కుటుంబం చెన్నైలోని కొడైకెనాల్ కు మారిపోయింది. తొలుత లఘు చిత్రాల్లో నటించిన బాబీ సింహా..బాలాజీ మోహన్ తెరకెక్కించిన లవ్ ఫెయిల్యూర్, ఇప్పటి స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన పిజ్జాలో చిన్న పాత్రల్లో మెరిశాడు.
ఈ సినిమాలతో అతడికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత నేరం అనే సినిమాలో విలన్ పాత్రలు చేశారు. బివేర్ ఆప్ డాగ్స్, జిగర్తాండతో పాటు సైజ్ జీరో వంటి సినిమాలో అతిధి పాత్ర పోషించారు. బెంగళూరు నాటక్కల్ సినిమాలో అమాయకమైన పాత్రలో , అమ్మాయి చేతిలో మోసపోయే పాత్రలో నటించి మెప్పించారు. 2016లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సందీప్ కృష్ణన్ నటించిన రన్ మూవీలో నటించారు. తర్వాత పలు తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా గడిపారు. 2020లో ఏదైనా జరగొచ్చుతో తిరిగి తెలుగు సినిమాలోకి వచ్చారు. డిస్కో రాజా, గల్లీ రౌడీ చిత్రాల్లో నటించారు. కన్నడలో 777 చార్లీలో, ఇటీవల ఓటీటీ ఫిల్మ్ గా వచ్చిన అమ్ములో.. మంచి పాత్ర పోషించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఢీ కొట్టి స్టార్ విలన్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు తెలుగు, తమిళ సినిమాలున్నాయి. బాబీ సింహా భార్య రేష్మీ మీనన్ కూడా నటే. వీరికి ఒక పాప, బాబు. ఈ స్టార్ విలన్ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూసేయండి.