సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతోమంది హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే.. ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ హీరోలుగా సక్సెస్ కాలేరు. హీరోలుగా సక్సెస్ అయినవారు క్రేజ్, అవకాశాలు ఉన్నంతవరకు కంటిన్యూ అవుతుంటారు.. లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి వేరే సినిమాలలో నటిస్తూ ఉంటారు. కానీ.. ఇండస్ట్రీలో అడుగు పెట్టినవారిలో కొందరు మాత్రమే.. హీరోగా సక్సెస్ కాలేదు కదా అని ఆగిపోకుండా.. టాలెంట్ ప్రూవ్ చేసుకొని దర్శకులుగానో, అవగాహన ఉంటే నిర్మాతలుగానో సినిమాలు చేసి సర్ప్రైజ్ చేస్తుంటారు.
ఇక ఇండస్ట్రీలో హీరోలుగా ఫెయిల్ అయినప్పటికీ, దర్శకులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వారు కూడా ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో చేరాడు టాలీవుడ్ యువదర్శకుడు మల్లిడి వశిష్ఠ్. టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి కుమారుడే ఈ మల్లిడి వశిష్ఠ్. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్న టైంలోనే మల్లిడి సత్యనారాయణ తన కుమారుడు మల్లిడి వశిష్ఠ్ అలియాస్ వేణుని హీరోగా పరిచయం చేశాడు.
2007లో ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాతో మల్లిడి వేణు(వశిష్ఠ్) హీరోగా తెరంగేట్రం చేశాడు. కులశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంజలి హీరోయిన్ గా నటించింది. అంజలికి హీరోయిన్ గా ఇది రెండో సినిమా. కాగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో మల్లిడి వశిష్ఠ్ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. ఇక హీరోగా మొదటి ప్రయత్నం విఫలమయ్యేసరికి మళ్లీ హీరోగా సినిమాలు చేయలేదని తెలుస్తుంది. కానీ.. అప్పుడెప్పుడో హీరోగా చేసిన ఇతని గురించి ఇప్పుడెందుకు అనిపించవచ్చు.
అందుకు ఓ బలమైన కారణం ఉంది. అదేంటంటే.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రస్తుతం విడుదలకు సిద్ధమైన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘బింబిసార’. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకుడే మల్లిడి వశిష్ఠ్. ఒకప్పటి హీరో మల్లిడి వేణునే.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బింబిసార మూవీ దర్శకుడు. నిజమా అని ఆశ్చర్యం కలగవచ్చు. కానీ.. ఇదే నిజమని అంటున్నాయి సినీవర్గాలు. అలాగే వశిష్ఠ్ హీరోగా నటించిన సినిమా పోస్టర్స్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీలో తన తండ్రి నిర్మాత కావడంతో వశిష్ఠ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఈజీ అయిపోయింది. కానీ.. హీరోగా విఫలం అవ్వడంతో అంతటితో ఆగకుండా దర్శకత్వం మీద ఆసక్తితో ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఈ క్రమంలో సొంత కథలు రాసుకొని.. ఐదేళ్ల నుండి దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఎట్టకేలకు కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారతో దర్శకుడిగా డెబ్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం వశిష్ఠ్ పేరు, లైఫ్ స్టోరీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి మల్లిడి వశిష్ఠ్ అలియాస్ వేణు లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
ఇది కూడా చదవండి:స్టేజ్‍పై రీతూ చౌదరి ఎమోషనల్.. తాను ఏడ్చి అందరినీ ఏడిపించేసింది!