తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 5 సీజన్స్ విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఈసారి ఆసక్తికరంగా జరిగిన 5వ్ సీజన్ విజేతగా VJ సన్నీ నిలిచి ‘బిగ్ బాస్ ట్రోఫీ’ అందుకున్నాడు. అయితే బిగ్ బాస్ అనేది చిన్నపాటి పాపులారిటీ కలిగిన స్టార్స్ పట్ల కల్పవృక్షంగా మారింది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక ఇంటి సభ్యులు అటు సీరియల్స్, సినిమాల పరంగా బిజీ అయిపోతున్నారు.
తాజాగా VJ సన్నీ బిగ్ బాస్ విజేతగా నిలవడంతో.. అతని లైఫ్ బయోగ్రఫీతో పాటు అచ్తింగ్ కెరీర్ కూడా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బిగ్ బాస్ లవర్స్ అంతా సన్నీ సినిమా గురించి వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో పాల్గొని మచ్చా.. కప్పు మనదే బిగిలూ.. డార్లింగ్ అనే పదాలతో యూత్ ను ఆకర్షించి కప్పు గెలుచుకున్నాడు సన్నీ.
‘జస్ట్ ఫర్ మెన్’ అనే టీవీ షోతో యాంకర్‌గా మారిన సన్నీ.. ఆ తర్వాత ప్రముఖ న్యూస్ ఛానెల్లో రిపోర్టర్‌గా చేరాడు. అలా తన కెరీర్లో పలువురు సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు సన్నీ. నిజానికి ‘కళ్యాణ వైభోగం’ అనే టీవీ సీరియల్ ద్వారా నటుడిగా బుల్లితెరపై పాపులర్ అయ్యాడు సన్నీ. ప్రస్తుతం బిగ్ బాస్ విజేత కావడంతో సన్నీకి సినిమా అవకాశాలు కూడా వస్తున్నట్లు తెలుస్తుంది.
త్వరలోనే సన్నీ సినీ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ‘సకలగుణాభి రామా’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇదివరకే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే విడుదలైన సాంగ్స్ కూడా సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయని చెప్పుకోవచ్చు. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని EIPL బ్యానర్ పై సంజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీతేజ, అషిమా నర్వాల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ రొమాంటిక్ ఫామిలీ ఎంటర్టైనర్ త్వరలోనే రిలీజ్ కానుందని సమాచారం. సన్నీ డెబ్యూ మూవీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.