తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి. చిన్నపాటి కామెడీ రోల్స్ తో అడపాదడపా సినిమాల్లో మెరిసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో సీరియల్స్ లో నటిస్తుంది. ఇటీవలే రియాలిటీ షో బిగ్ బాస్ 4వ సీజన్ లో పాల్గొని కొద్దిరోజులకే వెనుదిరిగింది. అయితే.. కళ్యాణికి సినిమాలు, సీరియల్స్ లో మాత్రమే కాకుండా రెగ్యులర్ గా వివాదాల్లో కనిపించడం అలవాటే.
ఈ మధ్యకాలంలో వివాదాల్లో నిలుస్తూ ఏదోక విధంగా వార్తల్లోకెక్కుతుంది. తాజాగా కళ్యాణి పై హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో జరిగిన ఓ మైనర్ బాలిక హత్య కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ఆ కేసుకు సంబంధించి సాక్ష్యాలను కరాటే కళ్యాణి లీక్ చేసి.. కేసును తారుమారు చేసే ప్రయత్నం చేసిందని నితీష్ అనే వ్యక్తి రంగారెడ్డి కోర్టులో కళ్యాణి పై కేసు వేశాడు.ఆ కారణంగా కళ్యాణి పై రంగారెడ్డి జిల్లా కోర్టు కేసు నమోదు చేయాలనీ జగద్గిరిగుట్ట పోలీసులకు ఆదేశాలు పంపింది. కేసు అయితే నమోదైంది.. కానీ ఆ మైనర్ బాలిక హత్యకి, కరాటే కళ్యాణికి సంబంధం ఏంటని వివరాలు బయటికి రాలేదు. ఓవైపు ఈ కేసు విషయంలో కరాటే కళ్యాణి నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవలే బండి సంజయ్ ఆధ్వర్యంలో కళ్యాణి బీజేపీ కండువా కప్పుకుంది. అలాగే మా ఎన్నికల్లో కూడా విష్ణు ప్యానల్ తరపున సెక్రెటరీగా పోటీ చేసింది. మరి ఈ కేసు ఈ విషయంపై మీ అభిపాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.