తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి. చిన్నపాటి కామెడీ రోల్స్ తో అడపాదడపా సినిమాల్లో మెరిసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో సీరియల్స్ లో నటిస్తుంది. ఇటీవలే రియాలిటీ షో బిగ్ బాస్ 4వ సీజన్ లో పాల్గొని కొద్దిరోజులకే వెనుదిరిగింది. అయితే.. కళ్యాణికి సినిమాలు, సీరియల్స్ లో మాత్రమే కాకుండా రెగ్యులర్ గా వివాదాల్లో కనిపించడం అలవాటే. ఈ మధ్యకాలంలో వివాదాల్లో నిలుస్తూ ఏదోక విధంగా వార్తల్లోకెక్కుతుంది. […]
సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి వరుస వివాదాల్లోకి వెళ్తూ చర్చల్లో నిలుస్తున్నారు. తాజాగా కరాటే కళ్యాణిపై మరో కేసులో ఇరుక్కున్నారు. ఓ కేసుకు సంబంధించి కళ్యాణిపై జగద్గిరిగుట్ట పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇక విషయం ఏంటంటే..? గతంలో సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధి సింగరేణి కాలనీలో ఓ మైనర్ బాలికపై జరిగిన హత్య వివరాలను డిస్ క్లోస్ చేసినందుకు కళ్యాణి అనేక ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదే కేసు సంబంధించి జగద్గిరిగుట్ట […]