సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి వరుస వివాదాల్లోకి వెళ్తూ చర్చల్లో నిలుస్తున్నారు. తాజాగా కరాటే కళ్యాణిపై మరో కేసులో ఇరుక్కున్నారు. ఓ కేసుకు సంబంధించి కళ్యాణిపై జగద్గిరిగుట్ట పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇక విషయం ఏంటంటే..? గతంలో సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధి సింగరేణి కాలనీలో ఓ మైనర్ బాలికపై జరిగిన హత్య వివరాలను డిస్ క్లోస్ చేసినందుకు కళ్యాణి అనేక ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఇదే కేసు సంబంధించి జగద్గిరిగుట్ట ప్రాంతంలోని ఎల్లమ్మ బండకు ఓ వ్యక్తి రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రైవేట్ కాంప్లేంట్ ఇచ్చారు. ఇక దీనిపై స్పందించిన కోర్టు ఆమెపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో జగద్గిరిగుట్ట పోలీసులు కరాటే కళ్యాణిపై కేసు నమోదు చేశారు. మరి దీనిపై కరాటే కళ్యాణి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.