Sravanthi: ఈ మధ్యకాలంలో సినిమాలలోనే కాదు.. బుల్లితెరపై కూడా గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తున్నారు లేడీ యాంకర్లు. అయితే.. సినిమాలలో, ఏవైనా స్పెషల్ ఈవెంట్స్ లో గ్లామర్ ఒలికించారంటే మామూలే. కానీ.. ఇప్పటివరకూ చూడచక్కగా.. నీట్ డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపించిన యాంకర్లు.. ఇప్పుడు ఫోటోషూట్స్ లో సైతం అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తునారు. తాజాగా అలాంటి జాబితాలో చేరింది బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ స్రవంతి చొక్కారపు.
యూట్యూబ్ ఛానల్స్ లో ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి.. పలువురు పాపులర్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసి పాపులారిటీ దక్కించుకుంది. అలా వచ్చిన క్రేజ్ ని ఉపయోగించుకొని పలు టీవీ షోలలో పాల్గొని.. మొత్తానికి బిగ్ బాస్ ఓటిటి సీజన్ లో కంటెస్టెంట్ గా ఛాన్స్ అందుకుంది. ఇక బిగ్ బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు, యూత్ కి దగ్గరైన స్రవంతి.. బయటికి వచ్చాక మళ్లీ తన యాంకరింగ్ ని కంటిన్యూ చేస్తోంది.
ఈ క్రమంలో బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక స్రవంతి గ్లామర్ షోలో హద్దులు చెరిపేసింది. ఇదివరకు క్లాస్, డీసెంట్ లుక్ లో ఫోటోషూట్స్ చేసిన స్రవంతి.. ఇప్పుడు ఏమాత్రం మొహమాటం లేకుండా టాప్ టు బాటమ్ ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇక తాజాగా బ్లాక్ డ్రెస్ లో పోస్ట్ చేసిన స్రవంతి.. సోషల్ మీడియాలో సెగలు రేపుతోందనే చెప్పాలి. ఈ లేటెస్ట్ బోల్డ్ ఫోటోలలో స్రవంతి అందాలపై ఫ్యాన్స్ మనసు పారేసుకుంటున్నారు. మరి స్రవంతి సరికొత్త ఫోటోలపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.