బోల్డ్ బ్యూటీ అషూరెడ్డి.. టిక్ టాక్ వీడియోల నుంచి సోషల్ మీడియాలో స్టార్ గా, బిగ్ బాస్, బిగ్ బాస్ నాన్ స్టాప్ తో సెలబ్రిటీగా ఎదిగింది. టాలీవుడ్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఏదున్నా సూటిగా చెప్పే లేడీ రామ్ గోపాల్ వర్మ అనే బిరుదు కూడా సొంతం చేసుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో అందం, అమాయకత్వంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత బయటకు వచ్చాక కూడా ఆమె ఫాలోయింగ్ బాగానే పెరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు రాహుల్ సిప్లిగంజ్ తో అంటీ ముట్టకుండా ఉన్న అషూ.. బయటకు రాగానే ఒక్కసారిగా క్లోజ్ అయ్యిపోయి అందరికీ షాకిచ్చారు.
ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ పునర్నవితో ఎంతో క్లోజ్ గా ఉన్నాడు. వాళ్లిద్దరూ కలిసి కూర్చోవడం, కలిసి తినడం లాంటివి చేశారు. కానీ, హౌస్ లో నుంచి రాగానే రాహుల్ సిప్లిగంజ్, అషూరెడ్డి కలిసి తిరగడం, ఫొటోలు షేర్ చేయడం చేశారు. ఆ టైమ్ లో వారి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత ఒక్కసారిగా వాళ్లిద్దరూ ఎవరి దారిన వాళ్లు ఉండటం ప్రారంభించారు. వారి రిలేషన్ పై అభిమానులకు ఏమీ అర్థంకాని పరిస్థితి ఉంది.
ఆ తర్వాత అషూరెడ్డి బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అడుగుపెట్టింది. రాహుల్ సిప్లిగంజ్ తన కెరీర్ తో తాను బిజీ అయిపోయాడు. ప్రస్తుతం అషూరెడ్డి కూడా మూవీలో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫేమ్ అజయ్ తో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అషూ రెడ్డి ఇన్ స్టాగ్రామ్ ఆస్క్ మీ సంథింగ్ పోల్ నిర్వహించగా ఆమెకు రాహుల్ సిప్లింగజ్, అజయ్ ని కంపేర్ చేస్తూ ప్రశ్న ఎదరైంది. అందుకు ఇద్దరితో ఉన్న ఫొటోలు పెట్టేసి.. ఒకరు నా ఫ్రెండ్, మరొకరు నా ఫ్యామిలీ అని చెప్పింది.
అయితే ఎవరు ఫ్రెండ్, ఎవరు ఫ్యామిలీ అని క్లారిటీ ఇవ్వలేదు. కానీ, కచ్చితంగా రాహుల్ సిప్లిగంజ్ తో ఉన్న రిలేషన్ ను రివీల్ చేసిందని కామెంట్ చేస్తున్నారు. రాహుల్ తన ఫ్యామిలీ మెంబర్ అని అషూ క్లారిటీ ఇచ్చిందనే ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. వారి మధ్య రిలేషన్ ఇంకా కొనసాగుతోందనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్ తో రిలేషన్ పై అషూ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.