తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున.. అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో 15వ కంటెస్టెంట్‌గా సీనియర్ నటి ఉమాదేవి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఉమాదేవి తెలుగు ప్రేక్షకులకి కొత్తేమి కాదు. చాలా సినిమాల్లో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటించింది. వీటిలో కొన్ని నెగిటివ్ షేడ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. 18 ఏళ్లకే ప్రేమపెళ్లి, ఏడేళ్ల కాపురం తరువాత విడాకులు ఈమె వ్యక్తిగత జీవితాన్ని బాగా దెబ్బ తీశాయి. ఎన్నో ఏళ్లుగా ఉమాదేవి బుల్లితెరని, వెండితెరని సమానంగా బ్యాలెన్స్ చేస్తూ నటిస్తోంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న ఉమాదేవి బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలదు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
(ముఖ్య గమనిక : అతి తక్కువ సమయంలో.. మాకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందించడం జరిగింది. త్వరలోనే మరింత సమాచారం అందిస్తాము)