తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో 7 కంటెస్టెంట్‌గా నటి ప్రియా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు ఈమె వివరాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రియ ప్రేక్షకులకి కొత్తేమి కాదు. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈమె సుపరిచితమే. అయితే.., ప్రియ సినీ ప్రస్థానం మొదలయింది మాత్రం 1998లో. ఆ ఏడాదిలో రిలీజ్ అయిన మాస్టర్ మూవీతో ప్రియ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ప్రియ అసలు పేరు మామిళ్ల శైలజ ప్రియ. సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లోనే ఈమె లీడ్ రోల్ చేసిన సీరియల్ ప్రియసఖి. ఈ సీరియల్ కి గాను నంది అవార్డు అందుకుంది ప్రియ. దీంతో.., కొంత కాలం బుల్లితెరని ఏలింది. కానీ.., తరువాత కాలంలో ఈమెకి సీరియల్స్ లో అవకాశాలు తగ్గాయి. దీంతో.., ఫుల్ టైమ్ మూవీస్ పై కాన్సంట్రేట్ చేసింది.
తరువాత కాలంలో హీరోహీరోయిన్లకు అక్క, తల్లి, అత్త, వదిన, పిన్ని.. ఇలా పలు సహాయక పాత్రల్లో ఒదిగిపోయిన సుమారు 60 సినిమాల్లో నటించింది.ఇలా 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో అజాత శత్రువుగా రాణిస్తోంది ప్రియ. ఇక 2002లో కిషోర్‌ను పెళ్లాడిన ఆమెకు నిశ్చయ్ అనే కుమారుడున్నాడు. కెరీర్ లో ఎన్నో విజయాలను, కష్టాలను అనుభవించిన ప్రియ.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం తన సెకండ్ ఇన్నింగ్స్ లా భావిస్తోంది. మరి.. సాదు స్వభావం ఉన్న ప్రియ బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలదు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
(ముఖ్య గమనిక : అతి తక్కువ సమయంలో.. మాకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందించడం జరిగింది. )