తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున.. అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో 16వ కంటెస్టెంట్గా నటుడు మానస్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు
మానస్ ఇండస్ట్రీకి, ప్రేక్షకులకి కొత్తేమి కాదు. ఇతను బాల నటుడిగా కెరీర్ ఆరంభించాడు . సోడా గోలి సోడా, ప్రేమికుడు, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, కాయ్ రాజ్ కాయ్ వంటి సినిమాలలో మానస్ నటించాడు. అయితే.., ఇవేవి ఇతని కెరీర్ గ్రాఫ్ ని అమాంతం పెంచలేకపోయాయి. దీంతో.. కొన్ని సీరియల్స్, వీటితో పాటు, షార్ట్ ఫిలిమ్స్, బుల్లితెర షోలలో కూడా నటించాడు మానస్.
నటుడిగా మానస్ ఇప్పటికీ బిజీగానే ఉన్నా.., తన మార్క్ చూపించుకునే అవకాశాలు మాత్రం ఇతనికి ఇప్పటి వరకు దక్కలేదనే చెప్పుకోవాలి.అమ్మను వదిలి ఉండలేను అంటూ.., కాస్త భారంగానే మానస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి చూడటానికి క్యూట్ అండ్ కామ్ గా కనిపిస్తున్న మానస్.. బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలడు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
(ముఖ్య గమనిక : అతి తక్కువ సమయంలో.. మాకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందించడం జరిగింది. త్వరలోనే మరింత సమాచారం అందిస్తాము)